Advertisement

ఐపీఎల్‌లో ఆరంభమ్యాచ్‌ ఆరెండు జట్లమధ్యనే

By: Dimple Sat, 05 Sept 2020 09:38 AM

ఐపీఎల్‌లో ఆరంభమ్యాచ్‌ ఆరెండు జట్లమధ్యనే

ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభానికి రోజులు దగ్గర పడుతున్నకొద్ధీ ఒకటే టెన్షన్‌ క్రియేటవుతోంది. ఐపీఎల్‌ షెడ్యూలు ఖరారుకు ముందే... బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ క్రికెట్‌ అభిమానులకు శుభవార్తను అందించాడు. ఆనవాయితీ ప్రకారం... ఐపీఎల్‌ మ్యాచుల్ని యధా ప్రకారమే నిర్వహిస్తామన్నారు. అంటే... డిపెండింగ్‌ ఛాంపియన్‌.. ముంబై ఇండియన్స్‌... రన్నరప్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లమధ్య ఖచ్చితంగా మ్యాచు జరుగుతుందనే సంకేతాలను అందించాడు.

అబుదాబిలో విడిది చేస్తున్న ముంబై ఇండియన్స్‌... జబర్దస్త్‌గా... ప్రాక్టీస్‌ చేస్తోంది. దుబాయ్‌ చేరుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాళ్లకు కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు వెలుగు చూడటం... తో ఆరంభమ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. వారం రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కీలక ఆటగాడు.. రైనా తన వ్యక్తిగత కారణాలతో దుబాయ్‌ నుంచి ఇండియాకి తిరుగుముఖం పట్టడం... ఆ తర్వాత మరో బౌలర్‌ హర్భజన్‌ సింగ్‌ ఇండియానుంచ దుబాయ్‌ కి వెళ్లకపోవడం... తదితర కారణాలతో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఓవైపు చెన్నై ఆటగాళ్లు... ఎవరికి వారు... మైదానాల్లోకి రాకపోయినా... ఎవరిగదుల్లో వారు... శారీరక వ్యాయామంతో కసరత్తుతో సాధన చేశారు. ఆతర్వాత నిర్వహించిన కరోనాటెస్టుల్లో నెగటివ్‌ రావడంతో... వివరాలను పరిశీలించిన గంగూలీ... ఆనవాయితీ ప్రకారం... ఆరంభమ్యాచ్‌ అనుకున్నట్లే... ముంబై ఇండియన్స్‌ - చెన్నై సూపర్‌ కింగ్స్ జట్లమధ్య జరిగుతుందనే భావన వ్యక్తం చేశారు. ఐపీఎల్ 2020 సీజన్‌‌ని సెప్టెంబరు 19 నుంచి ప్రారంభించేందుకు మార్గం సుగుమమైంది.

క్రికెట్‌ అభిమనులు కోరుకున్న విధంగానే... తమ ఆటగాళ్లు... దుబాయ్‌ మైదానాల్లో తమ విన్యాసాలతో వినోదాన్ని పంచుతారని... క్రికెట్‌ మైదానాల్లోకి దశలవారిగా... అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రొటోకాల్‌ నిబంధనలు పాటిస్తూ పరిమిత సంఖ్యలో అనుమతించే మార్గాలు సానుకూలంగా మారుతాయనే భావన వ్యక్తమవుతోంది. ఈ ఐపీఎల్‌ సీజన్‌ మాత్రం గత 12 సీజన్ల వీవర్‌షిప్‌ రికార్డును తిరగరాస్తుందనే భావన గంగూలీలో వ్యక్తమైంది. ఈ పరిస్థితుల్లో అభిమానులు తమ ఇళ్లల్లోంచే... ఐపీఎల్‌ మ్యాచుల్ని తిలకించి విజయవంతం చేయాలని కోరారు. చెన్నై శిబిరంలో కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన ఆటగాళ్లను 14 రోజుల ప్రత్యేక క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న తర్వాత పరీక్షలు నిర్వహించి... ఆటలోకి అనుమంతించే అవకాశాలను పరిశీలిస్తారని తెలుస్తోంది.

ఆబుదాబిలో బస చేస్తున్న కోల్కతా నైట్‌ రైడర్స్‌, ముంబై ఇండియన్స్‌, దుబాయిలో ఉంటున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, రాజస్థాన్‌ రాయల్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్లు క్రికెట్‌ మైదానాల్లో క్రమశిక్షణతో ప్రాక్టీస్‌ చేస్తూ చెమటోడుస్తున్నాయి.

Tags :
|
|

Advertisement