Advertisement

  • దుబాయికి చెన్నై జట్టు రెడీ - ఏ ఆటగాడికి ఎంత రెమ్యునరేషనో తెలుసా?

దుబాయికి చెన్నై జట్టు రెడీ - ఏ ఆటగాడికి ఎంత రెమ్యునరేషనో తెలుసా?

By: Dimple Sun, 09 Aug 2020 4:30 PM

దుబాయికి చెన్నై జట్టు రెడీ - ఏ ఆటగాడికి ఎంత రెమ్యునరేషనో తెలుసా?


దుబాయ్‌ వేదికలపై ఐపీఎల్‌ 2020 సీజన్‌కు ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. విదేశీ ఆటగాళ్లతో కలిసి ఆడేందుకు టీమిండియా యువ ఆటగాళ్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున 24 మంది ఆటగాళ్లు దుబాయ్‌ వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. 20 మంది చెన్నైఫ్రాంచైజీని అంటిపెట్టుకున్న ఆటగాళ్లుకాగా... 2019లో జరిగిన వేలంపాటలో నలుగురిని కొత్తగా కొనుగోలు చేశారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీ , 24 మంది ఆటగాళ్లకోసం 84 కోట్ల 85 లక్షలరూపాయలను వెచ్చిస్తోంది. మహేందర్‌ సింగ్‌ ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ సత్తాచాటేందుకు రెడీ అయింది. దుబాయ్‌ వేదికలపై ఐపీఎల్‌ మ్యాచులు ఆడే సూపర్ కింగ్స్‌ జట్టులో ఉన్న ఆటగాళ్లు ఎవరు... వాళ్లను ఎంత ఖరీదుతో ఫ్రాంచైజీ దక్కించుకుంది. వాళ్లలో ఆల్‌ రౌండర్లు ఎవరు.. బౌలర్లు... ఆట గతిని మార్చే బ్యాట్స్‌ మెన్లు ఎవరనే విషయం ఇపుడు చూద్ధాం..!

ఐపీఎల్‌ మ్యాచులపై అపార అనుభవం ఉన్న మహేంద్రసింగ్‌ ధోనీ చెన్నై సూపర్‌ కింగ్స్ కు కెప్టన్‌ గా వ్యవహరిస్తున్నారు. దుబాయ్‌ వేదికలపై ప్రత్యర్థి జట్లను ఆటకట్టించేందుకు ధోనీ కసరత్తు మొదలు పెట్టాడు. బౌలింగ్‌ మెషిన్‌తో బంతులు దూసుకొస్తుంటే... బ్యాటింగ్ ప్రాక్టీస్‌తో సాధన మొదలుపెట్టాడు. దుబాయ్‌ వెళ్లే ముందు సర్వసన్నద్ధం కావాలనే తపన ధోనీలో కన్పిస్తోంది. ఆటపట్ల అభిమానం... సాధనతో సత్తువ.. వెరసి... క్రికెట్‌ పట్ల అంకితభావం ధోనీలో ప్రస్ఫుటమవుతోంది. ఐపీఎల్‌ 2020 సీజన్‌ను ఎలాగైనా సొంతంచేసుకోవాలని చైన్నై జట్టు గట్టిగా ప్రయత్నిస్తోంది.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీ , ఆటగాళ్లకోసం అత్యధికంగా 84 కోట్ల 85 లక్షలరూపాయలను వెచ్చిస్తోంది. 24 మంది ఆటగాళ్లున్న ఈ జట్టులో 16 మంది ఇండియన్‌ క్రికెటర్లుకాగా... 8 మంది విదేశీ ఆటగాళ్లున్నారు.

ధోనీకి చెన్నై సూపర్‌ కింగ్స్‌ క్రికెట్‌ లిమిటెడ్‌ ఫ్రాంచైజీ యాజమాన్యం 15 కోట్ల రూపాయలను పారితోషికంగా అందిస్తోంది. ఆతర్వాత సీనియర్‌ క్రికెటర్‌, ఐపీఎల్‌ లో అత్యధిక మ్యాచులు ఆడిన రికార్డును సొంతంచేసుకున్న సురేశ్‌ రైనా... చెన్నై జట్టువిజయాల్లో బాధ్యతాయుత భాగస్వామ్యాన్ని అందించాడు. ధోనీ తర్వాత చెన్నై సూపర్‌ కింగ్స్‌ నుంచి అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఆటగాడు రైనా 11 కోట్లుతీసుకుంటున్నాడు. ఆల్‌ రౌండర్‌ కేదార్‌ జాదవ్‌ ఏడు కోట్ల ఎనభైలక్షలు... ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా 7 కోట్లు, బౌలర్‌ పియూష్‌ ఛావ్లా ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షలు, బ్యాటింగ్‌ తోనూ.. బౌలింగ్‌ తోనూ ఆటను మలుపు తిప్పే డ్వేన్‌ బ్రేవోకు ఆరుకోట్ల నలభై లక్షలు... ఆల్‌ రౌండర్‌ శామ్‌ కురేన్‌కు ఐదు కోట్ల యాభైలక్షలు, ఆల్‌ రౌండర్‌ కరణ్‌ శర్మకు 5 కోట్లు... ఆల్‌ రౌండర్‌ షేన్‌ వాట్సన్‌కు నాలుగు కోట్లు, బౌలర్‌ శార్థుల్‌ ఠాకూర్‌కు రెండు కోట్ల అరవై లక్షలు.. బ్యాటింగ్‌ చిచ్చర పిడుగు.. దూకుడుగా ఆడే బ్యాట్స్‌ మెన్‌ అంబటి రాయుడుకు రెండుకోట్ల ఇరవైలక్షలు, బ్యాట్స్‌ మెన్‌ మురళీ విజయ్‌కి రెండుకోట్లు, బౌలర్‌ హర్బజన్‌ సింగ్‌ కు రెండు కోట్లు, బౌలర్‌ హేజిల్‌ వుడ్‌కు రెండు కోట్లు, ఆల్‌ రౌండర్‌ ఫెప్‌ డుప్లెసిస్‌ కు ఒక కోటి అరవైలక్షలు, బౌలర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌కు ఒక కోటి రూపాయలు, బౌలర్‌ దీపక్‌ ఛాహర్‌కు 80 లక్షలు, బౌలర్లు లుంగీ ఎంగిడీ, మిచెల్‌ శాంట్నర్‌ లకు చెరో యాభైలక్షలు, ఆల్‌ రౌండర్‌ ఆసిఫ్‌ కె.ఎం.కు నలభైలక్షలు, కొత్త బ్యాట్స్‌ మెన్లు మోను సింగ్‌కు 20 లక్షలు, రితురాజ్‌ గైక్వాడ్‌కు ఇరవైలక్షలు, బౌలర్‌ సాయికిశోర్‌కు ఇరవై లక్షలు, స్టాండ్‌ బై వికెట్‌ కీపర్‌ కు ఇరవై లక్షలతో చైన్నై సూపర్‌ కింగ్స్‌ దక్కించుకుంది.

Tags :
|
|
|
|
|

Advertisement