Advertisement

  • దుబాయ్‌ ఐపీఎల్‌ ఓ ఛాలెంజ్‌ లాంటిది - దినేశ్‌ కార్తిక్

దుబాయ్‌ ఐపీఎల్‌ ఓ ఛాలెంజ్‌ లాంటిది - దినేశ్‌ కార్తిక్

By: Dimple Sat, 22 Aug 2020 9:06 PM

దుబాయ్‌ ఐపీఎల్‌ ఓ ఛాలెంజ్‌ లాంటిది - దినేశ్‌ కార్తిక్

ఐపీఎల్‌కు ముందు ఎక్కువగా సాధన చేయకపోవడం కచ్చితంగా ప్రభావం చూపిస్తుందని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సారథి దినేశ్‌ కార్తీక్‌ అంటున్నాడు. తమ అభిమానులను గర్వపడేలా చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తామని పేర్కొన్నాడు. ఆ జట్టు ఆటగాళ్లతో కలిసి మీడియాతో మాట్లాడాడు.

ఐపీఎల్ మ్యాచులకోసం ఆబుదాబి చేరుకున్న కోల్కతా నైట్ రైడర్స్‌ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు.ఐపీఎల్‌ భిన్నమైంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నదంతా బాధాకరం. ఏదేమైనప్పటికీ క్రికెట్‌ ఆడటం మాత్రం సవాలే. అయితే మేం ఆడేటప్పుడు అభిమానులను సంతోషపెట్టాలని మాత్రం అర్థం చేసుకున్నాం. బయోబుడగ ఉంటుంది. కొన్ని నెలలుగా మేం ఎక్కువగా సాధన చేయలేకపోయాం. ఆడలేకపోయాం. అందుకే మేం ఎదురెళ్లే దారి అడ్డంకులతో నిండివుంటుంది. కానీ మేం శాయశక్తులా కృషి చేస్తాం’ అని కార్తీక్‌ అన్నాడు.

తమ సొంతమైదానం ఈడెన్‌ గార్డెన్స్‌లో ఆడకపోవడంతో అభిమానుల మద్దతు మిస్సవుతామని డీకే తెలిపాడు. అది తమ హృదయమని పేర్కొన్నాడు. కొద్దిపాటి ఆత్రుత, ఆందోళనతో తాము యూఏఈకి వచ్చామని, అభిమానుల ఆశీస్సులు తీసుకుంటున్నామని వెల్లడించాడు. లాక్‌డౌన్‌ అమలైన మొదట్లో ఇబ్బందులు పడ్డాడనని చైనామన్‌ బౌలర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ తెలిపాడు. బయట సాధన చేయలేక పోయానని, ఇప్పుడు సర్దుకున్నానని వెల్లడించాడు. వారానికి ఏడు రోజులూ మ్యాచులున్నా సంతోషమేని పేర్కొన్నాడు.

చాలా కాలం నుంచి క్రికెట్‌ ఆడేందుకు ఎదరుచూస్తున్నా. మేమంతా ఇళ్లలోనే ఉండిపోయాం. మానసికంగా సిద్ధమయ్యాం. ఇప్పుడు ఉత్సాహంగా ఉంది. మైదానంలోకి వెళ్లి నన్ను నేను నిరూపించుకొనేందుకు ఆత్రుగా ఎదురుచూస్తున్నా’ అని యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ అన్నాడు. కాగా అతడికి తమ నాయకత్వ బృందంలో చోటిస్తామని జట్టు ప్రధాన కోచ్‌ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ చెప్పిన సంగతి తెలిసిందే.

Tags :
|

Advertisement