Advertisement

  • ఐపీయల్ స్పాన్సర్ గా వివోను రద్దు చేయాలన్నవ్యాఖ్యలను స్వాగతిస్తున్న హర్భజన్ ..

ఐపీయల్ స్పాన్సర్ గా వివోను రద్దు చేయాలన్నవ్యాఖ్యలను స్వాగతిస్తున్న హర్భజన్ ..

By: Sankar Sun, 21 June 2020 5:13 PM

ఐపీయల్ స్పాన్సర్ గా వివోను రద్దు చేయాలన్నవ్యాఖ్యలను స్వాగతిస్తున్న హర్భజన్ ..



చైనా ,భారత్ మధ్య జరిగిన సంఘర్షణలలో భారత సైనికులు 20 మందిదాకా చనిపోవడంతో దేశంలో ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది ..మన సైనికుల ప్రాణాలు తీసిన చైనాను దెబ్బకొట్టాలని భారతీయులు భావించారు ..ప్రపంచ మార్కెట్లో చైనా కంపెనీలవే సింహభాగం ఉంటాయి దీనితో చైనా నుంచి వచ్చే వస్తువులను కొనడం మానేస్తే చైనా మార్కెట్ దెబ్బతింటుంది అని ఇండియాలో బ్యాన్ చైనా నినాదం ఊపు అందుకుంది ..

అయితే ఇండియన్ క్రికెట్లో అతి పెద్ద టోర్నీ అయిన ఐపీయల్ స్పాన్సర్ వివో కూడా చైనా కంపెనీ ఏ కావడంతో ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు ..తాజాగా ఆ లిస్ట్లో స్టార్ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా చేరాడు..స్వయం సమృద్ధిని సాధించాలంటే చైనా ఉత్పత్తులను బాయ్‌కాట్‌ చేయడమే మంచిది. వాళ్ల దేశాన్ని మన సొమ్ముతో ఎలా నడుపుతారు? చైనా వస్తువులను బాయ్‌కాట్‌ చేసే వారితో నేనూ ఉంటా. నాకు ఎలాంటి చైనా ఎండార్స్‌మెంట్లు లేవు’ అని హర్భజన్‌ చెప్పాడు.

ఇక.. ఐపీఎల్‌ స్పాన్సర్‌గా ఉన్న చైనా సెల్‌ఫోన్ల తయారీ సంస్థ వివోతో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని కొందరు బీసీసీఐని కోరుతున్నారు. దీనిపై భజ్జీ స్పందిస్తూ.. ‘ఐపీఎలే ఒక పెద్ద బ్రాండ్‌. దానికి ఎటువంటి ప్రచారం అవసరం లేదు. అలాంటప్పుడు చైనా స్పాన్సరర్లే ఎందుకు? వీళ్లు కాకపోతే.. ఇంకొకరు వస్తారు’ అని అన్నాడు.

Tags :
|
|

Advertisement