Advertisement

  • ఐపీఎల్‌లో రికార్డుల్ని సొంతం చేసుకున్న ఆటగాళ్లు వీరే

ఐపీఎల్‌లో రికార్డుల్ని సొంతం చేసుకున్న ఆటగాళ్లు వీరే

By: Dimple Mon, 10 Aug 2020 4:37 PM

ఐపీఎల్‌లో రికార్డుల్ని సొంతం చేసుకున్న ఆటగాళ్లు వీరే

ఐపీఎల్‌... బౌండరల మోత... తారాజువ్వల్లా సిక్సర్ల విన్యాసాలు... అడుగడుగునా ఉత్కంఠ... బుల్లెట్‌ వేగంతో సంధించే బంతులతో బౌలర్లు... ఆ బంతుల్ని తమ బ్యాటుతో దుమ్మురేపే బ్యాట్స్‌ మెన్లు..ఆట మొదలుకావడమే తరువాయి... తొలి బంతినుంచి ఆఖరు బంతిదాకా ఒకటే బాదుడు.. వికెట్లు పడగొట్టడానికి బౌలర్ల ఆపసోపాలు... కొన్ని మ్యాచుల్లో బౌలర్లది ఆదిపత్యమైతే... మరి కొన్ని మ్యాచుల్లో బ్యాట్స్‌ మెన్లదే హవా... ఇలా 12 సీజన్లలో ఐపీఎల్‌ మ్యాచులు వేదికగా విధ్వంసకర బ్యాట్స్‌ మెన్లు ఆటస్వరూపాన్ని మార్చేశారు. ఫలితాలను తారుమారు చేసిన సందర్భాలు లేకపోలేదు. ఐపీఎల్‌ మ్యాచుల్లో బంతికి, బ్యాటుకు మధ్య జరిగిన పోరులో బ్యాటింగ్‌ ఆధిపత్యమే అభిమానుల్ని అలరించింది. బౌండరీల్లోనూ... సిక్సర్లతోనూ రికార్డులు నెలకొల్పారు. అర్థసెంచరీలు.. సెంచరీలతో రికార్డుల్ని సొంతం చేసుకున్నారు. బౌలర్లు తమ బంతులతోనూ... అద్భుతాలు సృష్టించారు. ఇంతకీ బౌలర్ల రికార్డులు... బ్యాటింగ్‌తో ఎవరెవరు... ఎప్పుడెప్పుడు విధ్వంసం సృష్టించారోనని ఇపుడు చూద్ధాం..!

1.ఐపీఎల్‌లో అత్యధికంగా పరుగులు సాధించిన క్రికెటర్‌గా పరుగుల వీరుడిగా విరాట్ కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. 169 మ్యాచ్‌ల్లో 5412 పరుగులు సాధించాడు. కోహ్లీ రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ తరఫున ఆడుతున్నాడు... 12 ఐపీఎల్‌ సీజన్లలో ఆల్ టైమ్‌ రికార్డు ఇప్పటిదాకా విరాట్‌ కోహ్లీపేరున నమోదైంది.

2. ఐపీఎల్ లో అత్యధిక క్యాచ్ లు పట్టిన ఆటగాడిగా చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్‌ రైనా రికార్డు సృష్టించాడు...
రైనా 189 మ్యాచ్‌ల్లో 102 క్యాచ్‌లు పట్టాడు.

3. ఐపీఎల్‌లో ఎక్కువ మందిని ఔట్‌ చేసిన వికెట్‌ కీపర్‌గా దినేశ్‌ కార్తీక్‌ రికార్డు సాధించాడు. 182 మ్యాచ్‌ల్లో 124 ఔట్లు అందులో 101క్యాచ్‌లు, 30 స్టంపింగ్లు ఉన్నాయి. దినేశ్‌ కార్తీక్‌ దిల్లీ డేర్‌డెవిల్స్‌, గుజరాత్‌ లయన్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు తరఫున ఆడాడు.

4. బ్యాట్స్‌మన్‌ ఆధిపత్యం కనిపిస్తున్న ఐపీఎల్‌లో బౌలర్లూ అదరగొట్టిన సందర్భాలున్నాయి. లెగ్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా మూడు సార్లు హ్యాట్రిక్‌ సాధించి రికార్డు సృష్టించాడు. 2008లో దిల్లీ డేర్‌డెవిల్స్‌ పై ,2011 లో డెక్కన్‌ ఛార్జర్స్‌ పై , 2013 లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పై మిశ్రా హ్యాట్రిక్‌ సాధించాడు.

5.ఒక ఓవర్‌ వేసి.. ఒక్క పరుగూ ఇవ్వకపోవడం ఐపీఎల్‌లతో సాధ్యమంటారా? బ్యాట్స్‌మన్‌ జోరు చూస్తుంటే కష్టమే అనిపిస్తోంది. కానీ ఐపీఎల్‌లో అప్పుడప్పుడు అలాంటివీ జరిగాయి. వారిలో అత్యధికం ప్రవీణ్‌ కుమార్‌ వేశాడు. ఈ మాజీ క్రికెటర్‌ 119 మ్యాచ్‌ల్లో 14 ఓవర్లు మెయిడిన్‌ వేశాడు.

6.భారత జట్టను వరుస విజయాలతో ముందుకు తీసుకుపోతున్న విరాట్‌ కోహ్లీ... ఐపీఎల్‌లో మాత్రం తన జట్టును ఆ స్థాయిలో నడిపించలేకపోతున్నాడు. ఈ క్రమంలో అత్యంత చెత్త రికార్డును కూడా సాధించాడు. 2017లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ చేతిలో 10 ఓవర్లలోపే 49 పరుగులకు ఆలౌటై.. అతి తక్కువ పరుగుల రికార్డు కొట్టేశాడు.

7.ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా క్రిస్‌ గేల్‌ రికార్డు సాధించాడు. 2013లో పుణె వారియర్స్‌పై 66 బంతుల్లోనే 175 పరుగులు బాది అజేయంగా నిలిచాడు. ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా క్రిస్‌ గేల్‌ రికార్డు నెలకొల్పాడు. ఈ వెస్టిండీస్‌ ఆటగాడు 124 మ్యాచ్‌ల్లో 326 సిక్సర్లు కొట్టాడు.

8. ఐపీఎల్‌ అంటేనే ఫోర్లు, సిక్స్‌లు. క్రీజులోకి వచ్చామా.. కొట్టామా... వెళ్లామా అనుకుంటుంటారు బ్యాట్స్‌మన్‌. అలా ఐపీఎల్‌లో ఇప్పటివరకు అత్యధికంగా ఫోర్లు బాదిన ఆటగాడిగా గౌతమ్‌ గంభీర్‌ రికార్డు నెలకొల్పాడు. అలా ఎడమచేతి వాటం ఓపెనర్‌158 ఇన్నింగ్స్‌లో 524 బౌండరీలను బాదేశాడు.

9.ఐపీఎల్‌లో అత్యధిక డాట్‌ బాల్స్‌ వేసిన రికార్డు టర్బోనేటర్‌ హర్భజన్‌ సింగ్‌ పేరిట ఉంది. ఈ మాజీ ముంబయి ఇండియన్స్‌ క్రికెటర్‌ 160 మ్యాచ్ లు ఆడి అత్యధికంగా 1249 బంతుల్ని పరుగులు రాకుండా కట్టడి చేశాడు. ప్రస్తుతం చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడుతున్నాడు.

10. టీమిండియాలో స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌ మెన్‌ కేఎల్‌ రాహుల్‌ పేరు మీదా ఓ రికార్డు ఉంది. అదే వేగవంతమైన అర్ధ శతకం. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు ఆడుతున్న కేఎల్‌ రాహుల్‌ 2018లో దిల్లీ డేర్‌డెవిల్స్‌పై 14 బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తి చేశాడు.

11.శ్రీలంక ఆటగాడు లసిత్‌ మలింగ ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టాడు. అన్ని సీజన్లలో ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడిన మలింగ 122 మ్యాచ్‌ల్లో 170 వికెట్లు తీశాడు. ఈ ఏడాది మల్లి మెరుపులు మెరిపించేందుకు సిద్ధంగా ఉన్నాడు..

12. టీంఇండియాలో పరుగుల యంత్రం... విరాట్‌ కోహ్లీ. దక్షిణాఫ్రికాకు చెందిన మిస్టర్‌ 360 డిగ్రీ బ్యాట్స్‌మన్‌ ఎబీ డివిలియర్స్‌. వీరిద్దరూ కలిస్తే ఆ ఆట అదుర్స్‌. అందుకు తగ్గట్టే వీరిద్దరూ కలసి మూడేళ్ల క్రితం ఓ మ్యాచ్‌లో అదరగొట్టేశారు. 2016లో గుజరాత్‌ లయన్స్‌పై 229 పరుగులు చేసి రికార్డు సృష్టించారు.

13.ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లకు మహేంద్ర సింగ్‌ ధోని కెప్టెన్‌గా వ్యవహరించి రికార్డు సృష్టించాడు. 2008 నుంచి 2019 వరకు 174 మ్యాచ్‌ల్లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, రైజింగ్‌ పుణె సూపర్‌జైంట్స్‌ జట్లకు నాయకత్వం వహించాడు. ప్రస్తుతం చెన్నై జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.

14. ఐపీఎల్ లో ఎక్కువ మ్యాచ్ లు ఆడిన ఆటగాడిగా సురేష్ రైనా రికార్డు సాధించాడు...చెన్నై సూపర్ కింగ్స్,గుజరాత్ లయన్స్ జట్ల తరపున రైనా 193 మ్యాచ్ లు ఆడాడు..

15. ఐపీఎల్ లో ఎక్కువ మ్యాన్ అఫ్ ది మ్యాచ్ లు గెలిచిన ఆటగాడిగా క్రిస్ గేల్ రికార్డు సాధించాడు... కోల్కతా,ఆర్సీబీ,పంజాబ్ జట్ల తరపున ఆడిన గేల్ 20 సార్లు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు..

16. ఐపీఎల్ లో ఎక్కువ మ్యాచులకు అంపైరింగ్ చేసిన అంపైర్ గా సుందరం రవి రికార్డు సాధించాడు... రవి మొత్తం 109 ఐపీఎల్ మ్యాచ్ లకు అంపైర్ గా చేసాడు..

17. ఐపీఎల్ లో ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాడిగా గేల్ రికార్డు సాధించాడు... కోల్కతా,ఆర్సీబీ,పంజాబ్ జట్ల తరపున ఆడిన గేల్ మొత్తంగా 6 ఐపీఎల్ సెంచరీలు సాధించాడు..

18. ఐపీఎల్ లో ఎక్కువ ఆఫ్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా డేవిడ్ వార్నర్ రికార్డు సాధించాడు.. ఢిల్లీ,హైదరాబాద్ జట్ల తరపున ఆడిన వార్నర్ ఐపీఎల్ లో మొత్తంగా 44 ఆఫ్ సెంచరీలు సాధించాడు..

Tags :
|

Advertisement