Advertisement

  • IPL 2020 SRH VS KKR: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మళ్లీ పరాజయం...!

IPL 2020 SRH VS KKR: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మళ్లీ పరాజయం...!

By: Anji Sun, 27 Sept 2020 00:02 AM

IPL 2020 SRH VS KKR: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మళ్లీ పరాజయం...!

ఐపీఎల్ 2020 సీజన్‌లో వరుసగా రెండో మ్యాచ్‌ల్లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి పరాజయం ఎదురైంది. అబుదాబి వేదికగా శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో తేలిపోయిన సన్‌రైజర్స్‌ని 7 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ అలవోకగా ఓడించేసింది.

మ్యాచ్‌లో మనీశ్ పాండే (51: 38 బంతుల్లో 3x4, 2x6) హాఫ్ సెంచరీ బాదడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 4 వికెట్ల నష్టానికి 142 పరుగులే చేయగలిగింది. లక్ష్యాన్ని ఓపెనర్ శుభమన్ గిల్ (70 నాటౌట్: 62 బంతుల్లో 5x4, 2x6) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడటంతో కోల్‌కతా మరో 12 బంతులు మిగిలి ఉండగానే 145/3తో ఛేదించేసింది. తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో 10 పరుగుల తేడాతో హైదరాబాద్ ఓడిపోయిన విషయం తెలిసిందే.

Tags :

Advertisement