Advertisement

IPL 2020 RR Vs MI Live Score : ముంబైతో రాజస్థాన్ ఢీ...!

By: Anji Sun, 25 Oct 2020 7:28 PM

IPL 2020 RR vs MI Live Score : ముంబైతో రాజస్థాన్ ఢీ...!

ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా ఆదివారం రాత్రి మరో రసవత్తరమైన పోరు జరుగుతోంది. అబుదాబి వేదికగా రాజస్థాన్ రాయల్స్‌, ముంబై ఇండియన్స్ జట్లు నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తాత్కాలిక కెప్టెన్ కీరన్ పొలార్డ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గాయంతో ఈ మ్యాచ్‌కి రోహిత్ శర్మ దూరమయ్యాడు. తాజా సీజన్‌లో 10 మ్యాచ్‌లాడిన ముంబై ఇండియన్స్ ఏడింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో ఫస్ట్ ప్లేససులో కొనసాగుతుండగా..

ఆ జట్టు ఈరోజు మ్యాచ్‌లో గెలిస్తే ప్లేఆఫ్‌లో ఎంటరవుతుంది. మరోవైపు 11 మ్యాచ్‌లాడిన రాజస్థాన్ రాయల్స్ కేవలం నాలుగు మ్యాచ్‌ల్లోనే గెలుపొంది పాాయింట్స్ టేబుల్‌లో లాస్ట్ ప్లేసులో ఉంది. ఆ జట్టు కనీసం ప్లేఆఫ్ రేసులో నిలబడాలన్నా ఈరోజు మ్యాచ్‌లో తప్పక విజయం సాధించాలి.

Tags :

Advertisement