Advertisement

  • IPL 2020 RR Vs KXIP: 15 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించిన రాజస్థాన్...!

IPL 2020 RR Vs KXIP: 15 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించిన రాజస్థాన్...!

By: Anji Mon, 28 Sept 2020 07:02 AM

IPL 2020 RR vs KXIP: 15 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించిన రాజస్థాన్...!

రాజస్థాన్ ఆటగాడు రాహుల్ తివాటియా అద్భుతం చేశాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఐదు సిక్సులు బాది మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. 224 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్ దూకుడుగా ఆడింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (27 బంతుల్లో 50), సంజూ శాంసన్ (42 బంతుల్లో 85) అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.

స్మిత్ ఔటైనా.. శాంసన్ రాజస్థాన్‌ను విజయం దిశగా నడిపాడు. కానీ షమీ వేసిన 17వ ఓవర్ తొలి బంతికి ఔటయ్యాడు. అప్పటికి రాజస్థాన్ స్కోరు 161 మాత్రమే. 21 బంతుల్లో 14 రన్స్ చేసిన తివాటియా క్రీజ్‌లో ఉండగా.. ఉతప్ప బ్యాటింగ్‌కు వచ్చాడు. అప్పటికీ రాజస్థాన్ విజయానికి 23 బంతుల్లో 63 రన్స్ అవసరం. దీంతో రాజస్థాన్ ఓడిపోతుందని భావించారంతా. ఉతప్ప రెండు ఫోర్లు బాదడంతో.. ఆ ఓవర్లో 12 రన్స్ వచ్చాయి. దీంతో రాజస్థాన్ విజయానికి 18 బంతుల్లో 51 రన్స్ అవసరమయ్యాయి.

పంజాబ్ కెప్టెన్ రాహుల్ కాట్రెల్‌కు బంతిని అందించాడు. ఇదే మ్యాచ్‌ను పంజాబ్ నుంచి దూరం చేస్తుందని ముందుగా ఎవరూ ఊహించలేకపోయారు. కాట్రెల్ బౌలింగ్‌లో రాహుల్ తివాటియా.. ఏకంగా ఐదు సిక్సులు బాదాడు. బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ దిశగా తొలి రెండు సిక్సులు బాదిన తివాటియా.. లాంగ్ ఆఫ్ దిశగా మూడో సిక్స్ కొట్టాడు. తర్వాతి బంతిని మిడ్ వికెట్ మీదుగా సిక్స్‌గా మలిచాడు. ఐదో బంతిని వదిలేసిన తివాటియా.. ఆరో బంతిని మిడ్ వికెట్ మీదుగా సిక్స్ కొట్టాడు. దీంతో ఆ ఓవర్లో 30 రన్స్ వచ్చాయి.

షమీ వేసిన తర్వాతి ఓవర్లో ఆర్చర్ రెండు సిక్సులు కొట్టగా.. ఓ సిక్స్ బాదిన తివాటియా ఔటయ్యాడు. కానీ అప్పటికే మ్యాచ్ రాజస్థాన్ వైపు మొగ్గింది. 18 బంతుల్లో 51 పరుగులు చేయడమే కష్టం అనుకుంటే.. రాజస్థాన్ 15 బంతుల్లోనే లక్ష్యాన్ని చేధించింది.

Tags :
|

Advertisement