Advertisement

IPL 2020 RCB Vs KKR : పూర్తిగా విఫలమైన కోల్‌కతా...!

By: Anji Tue, 13 Oct 2020 09:32 AM

IPL 2020 RCB vs KKR : పూర్తిగా విఫలమైన కోల్‌కతా...!

ఐపీఎల్‌-13లో మరో కీలక పోరు జరిగింది. గత మ్యాచ్‌ల్లో అద్భుతమైన‌ ఆటతో ప్రత్యర్థులను బెంబేలెత్తించిన రెండు జట్లు ఇవాళ నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి. సోమవారం రాత్రి షార్జా వేదికగా రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు, కోల్​కతా నైట్​రైడర్స్​ జట్లు తలపడ్డాయి.‌

మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు కోల్‌కతాకు 195 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే టార్గెట్ ఛేదించడంలో కోల్‌కతా పూర్తిగా విఫలమైంది. వచ్చిన బ్యాట్స్‌మెన్ వచ్చినట్టు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఈ క్రమంలో ఆర్సీబీ జట్టు 82 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Tags :

Advertisement