Advertisement

IPL 2020 MI Vs CSK: ముంబై టార్గెట్ 115

By: Anji Fri, 23 Oct 2020 9:43 PM

IPL 2020 MI vs CSK: ముంబై టార్గెట్ 115

ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా షార్జా వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలబడుతున్నాయి. ఈ మ్యాచ్‌కు ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా దూరం కాగా.. అతడి స్థానంలో పొలార్డ్ సారధ్య బాధ్యతలు చేపడుతున్నాడు.

ఇక ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముంబై ఒక్క మార్పుతో బరిలోకి దిగుతుంటే..చెన్నై మూడు మార్పులతో దిగింది.

ఈ మ్యాచ్ చెన్నైకు చాలా కీలకం కానుంది. షార్జా వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై బౌలర్ల ధాటికి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు.

తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ఐపీఎల్‌ చరిత్రలోనే తొలిసారిగా చెన్నై పవర్ ప్లేలో ఐదు వికెట్లు కోల్పోవడం గమనార్హం.

సామ్ కరన్(52) అర్ధ సెంచరీతో అదరగొట్టడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేయగలిగింది.

ఇక ముంబై బౌలర్లలో ఒక మెయిడిన్ ఓవర్ వేసి బౌల్ట్ నాలుగు వికెట్లు తీయగా.. బుమ్రా, రాహుల్ చాహార్‌లు రెండేసి వికెట్లు, కౌల్టర్‌నైల్‌ ఒక వికెట్ తీశారు.

Tags :
|

Advertisement