Advertisement

IPL 2020 DC VS KXIP HIGHLIGHTS: పంజాబ్‌ అద్భుత విజయం...!

By: Anji Wed, 21 Oct 2020 06:00 AM

IPL 2020 DC VS KXIP HIGHLIGHTS: పంజాబ్‌ అద్భుత విజయం...!

IPL 2020 లో దుబాయ్ వేదికగా మంగళవారం రాత్రి ఢిల్లీ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మధ్య జరిగిన మ్యాచ్ లోఅందరి అంచనాలు నిజమయ్యాయి. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ అద్భుతంగా పోరాడింది.

ఢిల్లీ క్యాపిటల్స్‌పై 5 వికెట్ల తేడాతో ఢిల్లీపై పంజాబ్‌ విజయం సాధించింది. 165 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్‌ మరో 6 బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కాస్త టెన్షన్‌ పెట్టినా.. వరుసగా మూడో విజయం సొంతం చేసుకుంది.

ప్లేఆఫ్‌ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. ఢిల్లీ నిర్దేశించిన 165 పరుగుల టార్గెట్‌ను విజయవంతంగా ఛేదించింది. 8 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానానికి చేరింది. రన్‌రేట్‌ను మెరుగుపర్చుకుంది.

నికోలస్‌ పూరన్‌ (53/ 28 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు), మాక్స్‌వెల్‌ (32/24 బంతుల్లో మూడు బౌండరీలు), క్రిస్‌గేల్‌ (29/ 13 బంతుల్లో మూడు బౌండరీలు , రెండు సిక్సర్లు) రాణించడంతో శిఖర్‌ ధావన్‌ (106/ 61 బంతుల్లో 12 బౌండరీలు, మూడు సిక్సర్లు) అద్భుత సెంచరీని వృథా అయింది.

వీరిద్దరూ భారీ సిక్సర్లతో విరుచుకుపడటంతో సాధించాల్సిన రన్‌రేట్‌ వేగంగా తగ్గిపోయింది. దీంతో ఆఖర్లో వచ్చిన బ్యాట్స్‌మెన్‌ నిలకడగా ఆడుతూ టార్గెట్‌కు దగ్గరగా చేరుకున్నారు. మిడిల్ ఓవర్లో మాక్స్‌వెల్ కీలక ఇన్నింగ్స్‌ ఆడటంతో జట్టుకు విజయం ఈజీగా మారింది.

ipl 2020: kxip won by 5 wickets on dc,best players list of dc,best players list of kxip,captain,delhi capitals,delhi capitals dream11 team player list,dream11 ipl 2020,dream11 team,dubai international cricket stadium,fantasy playing,indian premier league 2020,ipl 2020,kings xi punjab,kings xi punjab dream11 team player list,kings xi punjab vs delhi capitals,kxip vs dc,match 38,online cricket prediction,t20 match,vice-captain

తుషార్‌ దేశ్‌పాండే రెండు ఓవర్లు వేసి 41 పరుగులు సమర్పించుకున్నాడు. దేశ్‌పాండే వేసిన ఐదో ఓవర్‌లో గేల్‌ ఒక్కడే మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది ఇన్నింగ్స్‌కు కొత్త ఊపును తెచ్చాడు. ఆ ఓవర్‌లో గేల్‌ వీరవిహారం చేయడంతో 26 పరుగులు వచ్చాయి. మళ్లీ తుషార్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌లో పూరన్‌ వరుసగా సిక్స్‌, రెండు ఫోర్లు బాది 15 పరుగులు సాధించాడు.

మాక్స్‌వెల్‌ సహకారం అందిస్తుండగా ఈ క్రమంలోనే ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన పూరన్‌ 27 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. రబాడ వేసిన 13వ ఓవర్లో అనూహ్యంగా బంతి గ్లోవ్స్‌కు తాకి వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

ఈ దశలో మాక్స్‌వెల్‌ జట్టును ముందుండి నడిపించాడు. మళ్లీ రబాడ బౌలింగ్‌లోనే మాక్స్‌వెల్‌ భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. సాధించాల్సిన రన్‌రేట్‌ తక్కువగా ఉండటంతో దీపక్‌ హుడా, జేమ్స్‌ నీషమ్‌ జట్టుకు విజయాన్నందించారు.

కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ , అగర్వాల్‌ విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో రబాడ రెండు వికెట్లు తీయగా అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. తొలత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ‌ మరో అద్భుత ప్రదర్శన చేశాడు.

ధావన్‌కు శ్రేయస్‌ అయ్యర్‌ , రిషబ్‌ పంత్‌ కాస్త సహకారం అందించారు. పంజాబ్‌ బౌలర్లలో మహ్మద్‌ షమీ రెండు వికెట్లు తీయగా.. మాక్స్‌వెల్‌, నీషమ్‌, మురుగన్‌ అశ్విన్‌ తలో వికెట్‌ తీశారు.

Tags :

Advertisement