Advertisement

IPL 2020 KKR Vs RCB బెంగళూరు టార్గెట్ 85 పరుగులు మాత్రమే...!

By: Anji Wed, 21 Oct 2020 9:58 PM

IPL 2020 KKR vs RCB బెంగళూరు టార్గెట్ 85 పరుగులు మాత్రమే...!

ఐపీఎల్‌-13లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌ అవమానకరంగా సాగింది. పేసర్ మహ్మద్‌ సిరాజ్‌, స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ దెబ్బకు కోల్‌కతా వణికిపోయింది.

వీరిద్దరి ధాటికి కోల్‌కతా ఓ దశలో 40 పరుగులకే ఆరుగురు బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ దారిపట్టారు. కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ ఆదుకోవడంతో బెంగళూరుకు కోల్‌కతా 85 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.

సిరాజ్‌ నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడటంతో కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 84 పరుగులకే పరిమితమైంది. 2020 సీజన్‌లో ఇదే అత్యల్ప స్కోరు.

Tags :

Advertisement