Advertisement

  • ఐపీయల్ 2020 తొలి మ్యాచ్.. ముంబై వర్సెస్ చెన్నై..ఎవరి బ్యాటింగ్ బలం ఎంత !

ఐపీయల్ 2020 తొలి మ్యాచ్.. ముంబై వర్సెస్ చెన్నై..ఎవరి బ్యాటింగ్ బలం ఎంత !

By: Sankar Thu, 17 Sept 2020 2:38 PM

ఐపీయల్ 2020  తొలి మ్యాచ్.. ముంబై వర్సెస్ చెన్నై..ఎవరి బ్యాటింగ్ బలం ఎంత !

ఇంకొక రెండు రోజుల్లో క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీయల్ రానే వస్తుంది..తొలి మ్యాచ్ లో గత ఏడాది విజేత ముంబై ఇండియన్స్ , గత ఏడాది ఫైనల్లో ఓడిపోయినా చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది..అయితే ఐపీయల్ చరిత్రలోనే ఈ రెండు అత్యంత పటిష్ట జట్లు కావడంతో తొలి మ్యాచ్ మీద బారి అంచనాలు ఉన్నాయి...పేపర్ మీద చూసుకుంటే ముంబై ఇండియన్స్ పటిష్టంగా ఉన్నప్పటికి చెన్నై కెప్టెన్ ధోని అన్న విషయం మాత్రం మరవలేము..

అయితే తొలి మ్యాచ్ లో ఈ రెండు జట్ల బలాబలాలు ఒకసారి పరిశీలిస్తే బ్యాటింగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ రైనా లేకపోవడంతో కొంచెం డీలా పడింది..అయితే వాట్సన్ , రాయుడు , డుప్లెసి , ధోని వంటి స్టార్ ఆటగాళ్లకు రుతురాజ్ వంటి యువ ఆటగాళ్లు ఉన్నారు..అయితే రైనా లేని లోటు ఈ ఆటగాళ్లు పూడుస్తారా లేదా అన్నది టోర్నీ ప్రారంభం అయితే తెలుస్తుంది..

ఇక మరోవైపు ముంబై ఇండియన్స్ మాత్రం బ్యాటింగ్ లో అత్యంత పటిష్టంగా ఉంది..గత ఏడాది డి కాక్ ఏ స్థాయిలో రాణించాడో అందరికి తెలిసిందే..ఈ ఏడాది కూడా ఓపెనింగ్ లో డి కాక్ నుంచి అదే ప్రదర్శనను ఆశిస్తుంది ముంబై యాజమాన్యం, ఇక మరొక విధ్వంసక ఆటగాడు లిన్ కూడా జట్టుతో చేరడంతో బ్యటింగ్ మరింత దుర్బేధ్యంగా అయింది..ఇక ఇటీవలే ముగిసిన కరేబియన్ లీగ్ లో పోల్లర్డ్ తనలోని సరికొత్త విధ్వంసక ఆటగాడిని బయటకు తీసాడు..

ఇక పాండ్య బ్రదర్స్ ఎంత విద్వంసక వీరిలో కొత్తగా చెపాల్సిన అవసరంలేదు ..సూర్య కుమార్ యాదవ్ కూడా ముంబై జట్టులో చేరాక స్టార్ ఆటగాడిగా మారిపోయాడు..ఇక టీంలో అత్యంత కీలక ఆటగాడు , కెప్టెన్ రోహిత్ శర్మ ..కెప్టెన్ గా అదరగొడుతున్న రోహిత్ ,ఐపీయల్ లో బాట్స్మెన్ గా మాత్రం గత మూడు సీజన్లో లలో అంతగా ఆకట్టుకోలేకపోయాడు ..అయితే రోహిత్ ఒక్కసారి ఫామ్ లోకి వస్తే ఇక ఆ విధ్వంసం ఆపడం మాత్రం ఏ జట్టు తరం కాదు..

ఇలా బ్యాటింగ్ లో చెన్నై కంటే బలంగా ఉన్న ముంబై తొలి మ్యాచ్ లో ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు..మరి ఎవరు ఎలా ఆడతారో తెలియాలి అంటే ఇంకో రెండు రోజులుఆగాల్సిందే

Tags :
|

Advertisement