Advertisement

IPL 2020, DC Vs RCB Live Score : ఢిల్లీతో బెంగళూరు కీలక ఫైట్...!

By: Anji Mon, 02 Nov 2020 9:30 PM

IPL 2020, DC vs RCB Live Score : ఢిల్లీతో బెంగళూరు కీలక ఫైట్...!

ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా సోమవారం రాత్రి మరో రసవత్తరమైన పోరు జరగుతోంది. అబుదాబి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తాజా సీజన్‌లో 13 మ్యాచ్‌లాడిన ఆర్సీబీ జట్టు ఏడింట్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో సెకండ్ స్థానంలో కొనసాగుతుంది. ఢిల్లీ కూడా ఏడు విజయాలతో నెట్ రన్‌రేట్‌లో వ్యత్యాసం కారణంగా మూడో స్థానంలో ఉంది.

ఈరోజు మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ప్లేఆఫ్‌కి అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టుకి మంగళవారం ముంబయి, ఎస్ఆర్‌హెచ్ మధ్య జరగనున్న మ్యాచ్ ఫలితంతో ప్లేఆఫ్‌లు ఆశలు ఆధారపడి ఉంటాయి. మొదట్లో వరస విజయాలు నమోదు చేసిన బెంగళూరు, ఢిల్లీ జట్లు ఇప్పుడు పరాజయాల బాట పట్టాయి.

Tags :

Advertisement