Advertisement

  • IPL 2020 DC Vs MI: ఢిల్లీకి గట్టి పంచ్ ఇచ్చిన ముంబయి ఇండియన్స్...!

IPL 2020 DC Vs MI: ఢిల్లీకి గట్టి పంచ్ ఇచ్చిన ముంబయి ఇండియన్స్...!

By: Anji Mon, 12 Oct 2020 09:23 AM

IPL 2020 DC vs MI: ఢిల్లీకి గట్టి పంచ్ ఇచ్చిన ముంబయి ఇండియన్స్...!

ఐపీఎల్ 2020 సీజన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌కి డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ గట్టి పంచ్ ఇచ్చింది. అబుదాబి వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ టీమ్ 162 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని ముంబయి ఇండియన్స్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 166/5తో ఛేదించేసింది.

తాజా సీజన్‌ ఏడో మ్యాచ్ ఆడిన ముంబయికి ఇది ఐదో గెలుపుకాగా.. ఢిల్లీకి ఇది రెండో ఓటమి. పాయింట్ల పట్టికలోనూ ఢిల్లీని వెనక్కి నెట్టిన ముంబయి అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మ్యాచ్‌లో శిఖర్ ధావన్ (69 నాటౌట్: 52 బంతుల్లో 6x4, 1x6) హాఫ్ సెంచరీ బాదడంతో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.

ముంబయి బౌలర్లలో కృనాల్ పాండ్య రెండు వికెట్లు పడగొట్టగా.. ట్రెంట్ బౌల్ట్‌కి ఒక వికెట్ దక్కింది. హిట్టర్ స్టాయినిస్ (13: 8 బంతుల్లో 2x4) లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ స్లాగ్ ఓవర్లలో రనౌటవడం ఢిల్లీ టీమ్‌ని దారుణంగా దెబ్బతీసింది.

ఛేదనలో రోహిత్ శర్మ (5) ఫెయిలైనా.. మరో ఓపెనర్ డికాక్ (53: 36 బంతుల్లో 4x4, 3x6), మూడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (53: 32 బంతుల్లో 6x4, 2x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడేశారు. దాంతో.. సగం ఓవర్లు ముగిసే సమయానికే ఢిల్లీ చేతుల్లో నుంచి మ్యాచ్ చేజారిపోయినట్లు కనిపించింది.

కానీ.. డికాక్‌ని అశ్విన్ ఔట్ చేయగా.. సూర్యకుమార్‌ని రబాడ పెవిలియన్‌కి పంపడంతో ఢిల్లీ శిబిరంలో ఆశలు చిగురించాయి. అయితే.. యువ హిట్టర్ ఇషాన్ కిషన్ (28: 15 బంతుల్లో 2x4, 2x6) దూకుడుగా ఆడేసి బంతులు, పరుగుల మధ్య అంతరం తగ్గించేయగా.. ఆఖర్లో కీరన్ పొలార్డ్ (11 నాటౌట్: 14 బంతుల్లో 1x4), కృనాల్ పాండ్య (12 నాటౌట్: 7 బంతుల్లో 2x4) టెన్షన్ పెట్టినా.. ఢిల్లీకి అవకాశం ఇవ్వకుండా గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు.

Tags :

Advertisement