Advertisement

  • IPL 2020 DC Vs KKR: సిక్సర్లతో పోటీ పడిన పోరులో ఢిల్లీ విక్టరీ..!

IPL 2020 DC Vs KKR: సిక్సర్లతో పోటీ పడిన పోరులో ఢిల్లీ విక్టరీ..!

By: Anji Sun, 04 Oct 2020 06:48 AM

IPL 2020 DC vs KKR: సిక్సర్లతో పోటీ పడిన పోరులో ఢిల్లీ విక్టరీ..!

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో మరోసారి పరుగుల మోత మోగింది. ఢిల్లీ క్యాపిటల్స్‌-కోల్‌కతా నైట్‌రైడర్స్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌ పరుగుల మోతకు వేదికయ్యింది. ముందుగా ఊహించినట్లే షార్జాలో ఇరుజట్లు పరుగుల హోరులో తడిసిపోయాయి. ఈ ఉత్కంఠ భరితమైన పోరులో చివరకు ఢిల్లీ క్యాపిటల్స్‌ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో ఢిల్లీ, కేకేఆర్‌లు తలో 14 సిక్స్‌లు కొట్టడం విశేషం. ఢిల్లీ నిర్దేశించిన 229 పరుగుల టార్గెట్‌లో కేకేఆర్‌ ఎనిమిది వికెట్లు కోల్పోయి 210 పరుగులకే పరిమితమయ్యింది. కేకేఆర్‌ ఆటగాళ్లలో గిల్‌(28; 22 బంతుల్లో 2ఫోర్లు, 1 సిక్స్‌), నితీష్‌ రాణా(58; 35 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), మోర్గాన్‌(44;18 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్స్‌లు), రాహుల్‌ త్రిపాఠి(36; 16 బంతుల్లో 3 ఫోర్లు, 3సిక్స్‌లు)లు మెరుపులు మెరిపించినా జట్టును గెలిపించలేకపోయారు.

భారీ లక్ష్య ఛేదన కావడంతో కేకేఆర్‌ పోరాడి ఓడిపోయింది. ప్రధానంగా సునీల్‌ నరైన్‌(3), ఆండ్రీ రసెల్‌(13), దినేశ్‌ కార్తీక్‌(6)లు విఫలం కావడంతో కేకేఆర్‌ ఓటమి కారణమైంది. ఢిల్లీ బౌలర్లలో నోర్త్‌జే మూడు వికెట్లు సాధించగా, హర్షల్‌ పటేల్‌ రెండు వికెట్లు సాధించాడు.

రబడా, స్టోయినిస్‌, మిశ్రాలు తలో వికెట్‌ తీశారు. ఓ దశలో మోర్గాన్‌-త్రిపాఠిలు బ్యాట్‌ ఝుళిపించడంతో ఢిల్లీ గుండెల్లో దడపుట్టింది. కాగా, మోర్గాన్‌ నోర్త్‌జే ఔట్‌ చేయడం, ఆపై త్రిపాఠిని స్టోయినిస్‌ బౌల్డ్‌ చేయడంతో కేకేఆర్‌ ఓటమి ఖాయమైంది.

Tags :

Advertisement