Advertisement

  • IPL 2020 CSK Vs RR: గెలిచిన జట్టు ముందుకు వెళితే.. ఓడిన జట్టు ఇంటికి వెళ్లాల్సిందే...!

IPL 2020 CSK Vs RR: గెలిచిన జట్టు ముందుకు వెళితే.. ఓడిన జట్టు ఇంటికి వెళ్లాల్సిందే...!

By: Anji Mon, 19 Oct 2020 7:19 PM

IPL 2020 CSK vs RR: గెలిచిన జట్టు ముందుకు వెళితే.. ఓడిన జట్టు ఇంటికి వెళ్లాల్సిందే...!

ఇది డూ ఆర్ డై సమయం.. ఇప్పటివరకూ ఒక మ్యాచ్‌ ఓడినా.. మరో మ్యాచ్‌లో‌ చూసుకోవచ్చు అనేది ఉండేది. కానీ.. ఇప్పుడు మొత్తం మారిపోయింది. గెలిచిన జట్టు ముందుకు వెళితే.. ఓడిన జట్టు ఇంటికి వెళ్లాల్సిందే.

ఇక ప్రతి పాయింట్‌ కీలకమే. రన్‌రేట్‌ కూడా తెరపైకి వచ్చి ప్లేఆఫ్స్ జట్లను ఖరారు చేసే పరిస్థితులు సమీపించింది. అయితే ఈ టోర్నీలో కొనసాగాలంటే… కచ్చితంగా గెలవాల్సిదే… ఈ పరిస్థితి రెండు జట్లు సమరానికి సిద్ధమయ్యాయి.

చెన్నై, రాజస్థాన్‌ జట్ల మధ్య అబుదాబి వేదికగా జరుగనున్న మ్యాచ్‌లో నువ్వా నేనా అనే స్థాయిలో ఉత్కంఠగా సాగనుంది. చెన్నై, రాజస్థాన్‌ ఇప్పటి వరకూ 22 మ్యాచుల్లో తలపడ్డాయి. అందులో 14 విజయాలతో చెన్నైదే టాప్ పొజిషన్‌. రాజస్థాన్‌ కేవలం 8 మ్యాచుల్లో గెలిచింది.

ipl 2020 csk vs rr match prediction,abu dhabi,captain,chennai super kings,chennai super kings vs rajasthan royals,csk vs rr,dream11,dream11 ipl 2020,fantasy playing,ipl 2020,online cricket prediction,rajasthan royals,sheikh zayed stadium,t20 match 37,team prediction,vice-captain

అయితే ఇది గతం. ఈ లెక్కలు ఐపీఎల్ టీ20లో కుదరకపోవచ్చని చాలాసార్లు నిరూపితం అయ్యింది. ఇక ఈ సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లో మాత్రం స్మిత్‌సేనదే పైచేయి. చెన్నై ఆడిన గత ఐదు మ్యాచుల్లో రెండింట్లో గెలిచి.. మూడింట్లో నేల చూపులు చూసింది.

మరో వైపు రాజస్థాన్ ఒక మ్యాచ్‌లో గెలిచి నాలుగింట్లో ఓడింది. మరి గతంలోని ఆధిపత్యాన్ని చెన్నై మరోసారి ప్రదర్శిస్తుందా.. లేక రాజస్థాన్‌ తన పైచేయి సాధిస్తుందా చూడాలి. అన్నది వేచి చూడాల్సిందే. ఈ అబుదాబి స్టేడియంలో ధోనీ సేనకు మంచి రికార్డు ఉంది.

చెన్నై ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింట్లో గెలిచింది. ఐదు మ్యాచ్‌లాడిన ఆర్ఆర్ జట్టు కూడా నాలుగు విజయాలను సొంతం చేసుకుంది. గత మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓడి త్రుటిలో మ్యాచ్‌ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్‌లో ఎట్టిపరిస్థితుల్లో గెలువాలనే పట్టుదలతో సంమరానికి సిద్ధమవుతోంది.

అయితే ధోనీ సేనలో ఓపెనర్లు బాగానే రాణిస్తున్నారు. రాయుడు సైతం నమ్మదగిన ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. ఆఖర్లో జడేజా మంచి ఫినిషింగ్‌ ఇస్తున్నాడు. ధోనీ, కేదార్‌ జాదవ్‌ నుంచి భారీ ఇన్నింగ్స్‌ రావాల్సిన సమయం ఆసన్నమైంది.

ipl 2020 csk vs rr match prediction,abu dhabi,captain,chennai super kings,chennai super kings vs rajasthan royals,csk vs rr,dream11,dream11 ipl 2020,fantasy playing,ipl 2020,online cricket prediction,rajasthan royals,sheikh zayed stadium,t20 match 37,team prediction,vice-captain

ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన జాదవ్‌ పోషిస్తున్న పాత్ర ఏంటీ అన్నది ఎవరికీ అర్థంకాని ప్రశ్నగా మారింది. ఇదిలా ఉండగా.. గాయంతో ఆల్‌రౌండర్‌ బ్రావో దూరం అయ్యాడు. దీంతో ఆ జట్టులో డెత్‌ ఓవర్లలో‌ బౌలింగ్‌ స్పెషలిస్టు లోటు ఏర్పడింది.

ఈ కారణంగా చెన్నై ఇప్పటికే ఒక మ్యాచ్‌ను కోల్పోయింది. బ్రావో స్థానంలో లుంగీఎంగిడీని తీసుకునే అవకాశాలున్నాయి. గత మ్యాచ్‌లో విఫలమైన సామ్‌ కరన్‌ ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌లో విజృంభిస్తే చెన్నై తేలిగ్గా గెలుస్తుంది.

రాజస్థాన్‌ జట్టుకు మంచి బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఉంది. కానీ.. ఎవర్ని ఎప్పుడు పంపితే హిట్టింగ్ ఆడుతారు అనేది పెద్ద ప్రశ్న నెలకొంది. ఉతప్ప ఫామ్‌ అందుకోవడం ఆ జట్టుకు ఊరటనిచ్చే టాపిక్ కాగా… అయితే.. ఈ మ్యాచ్‌లో ఉతప్ప, బెన్‌స్టోక్స్‌ను ఏ స్థానంలో బ్యాటింగ్‌కు తీసుకొస్తారనేది కీలకమైన అంశంగా మారింది.

మిడిల్ ఓవర్లలో వికెట్లు పడిపోతున్నాయి. దీంతో ఆ జట్టు బౌలర్ల శ్రమ వృథా అవుతోంది. ఇక బౌలింగ్‌ విషయానికి వస్తే.. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఆ జట్టు బౌలర్‌ జయదేవ్‌ ఉనద్కత్‌ ఈ సీజన్‌లో ప్రదర్శించలేక పోయాడు.

గత చివరి మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసి 46 పరుగులు సమర్పించుకున్నాడు. మరోసారి సంజు తన బ్యాట్‌కు పని చెబితే రాజస్థాన్‌ గెలుపు చాలా ఈజీగా మారుతుంది. ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్ గెలువాల్సిన కీలక మ్యాచ్.

Tags :

Advertisement