Advertisement

  • ఐపీఎల్‌ టోర్నమెంటుకోసం ఫ్రాంచైజీలు సన్నద్ధమవుతున్నాయి

ఐపీఎల్‌ టోర్నమెంటుకోసం ఫ్రాంచైజీలు సన్నద్ధమవుతున్నాయి

By: Dimple Sun, 09 Aug 2020 06:45 AM

ఐపీఎల్‌ టోర్నమెంటుకోసం ఫ్రాంచైజీలు సన్నద్ధమవుతున్నాయి

ఐపీఎల్‌ టోర్నమెంటుకోసం ఫ్రాంచైజీలు సన్నద్ధమవుతున్నాయి. ఎవరి ఏర్పాట్లల్లో వాళ్లు బిజీగా ఉంటున్నారు. యూఎఈ వేదికగా ఈ ఐపీఎల్ సీజన్ జరగడం ఖరారైన నేపథ్యంలో అక్కడికి వెళ్ళేందుకు విమాన సర్వీసులు, వసతి ఏర్పాట్లు, ట్రైనింగ్ క్యాంపులపై దృష్టసారించాయి. ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ముందు వరుసలో ఉంది. మిగిలిన జట్ల కంటే ముందుగానే దుబాయ్ చేరుకుని ప్రాక్టీస్ మొదలపెట్టేందుకు ప్రణాళికలు సిధ్దం చేసుకుంటోంది. ఆటగాళ్లందరూ స్టార్‌ హోటళ్లలో గాకుండా... రిసార్టుల్లో బసచేయడానికి మక్కువ చూపుతున్నారు. దీంతో ఫ్రాంచైజీలకు వ్యయం తగ్గుతుందా? పెరుగుతుందా అనే విషయం పక్కనబెడితే... ఆటగాళ్లకోరినట్లుగానే ఫ్రాంచైజీలు మొగ్గుచూపే అవకాశాలు కన్పిస్తున్నాయి.

దుబాయ్‌ చేరుకోడానికి ఐపీఎల్‌ ఫ్రాంచైజీలన్నీ ప్రత్యేక ఛార్టెడ్‌ ఫ్లైట్లను సిద్ధంచేసుకుంటున్నాయి. ఆటగాళ్లతో పాటు.. కోచ్‌, సహాయకులతో ప్రయాణానికి రెడీ అవుతున్నారు. ఐపీఎల్‌ ఫ్రాంచైజీలన్నీ ఆగస్టు 20వ తేదీ తర్వాత దుబాయ్‌కి బయలుదేరడానికి సిద్ధంగా ఉండాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. వీళ్లలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు మాత్రం ఆగస్టు 22 తేదీన బయలు దేరాలని నిర్ణయం తీసుకుంది.


దీంతో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ అన్ని జట్లకంటే ముందుగా దుబాయ్ లో అడుగుపెట్టే అవకాశాలున్నాయి. దీని కోసం ఫ్రాంచైజీ యాజమాన్యం స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేస్తోంది. ఆగష్ట్ రెండో వారంలోనే తమ ఆటగాళ్ళ ట్రైనింగ్ క్యాంప్ మొదలవుతుందని చెన్నై ఫ్రాంచైజీ ప్రతినిధి వెల్లడించారు. చెన్నై సూపర్ కింగ్స్‌ సారధి ధోనీ మాత్రం రాంచీలోని క్రికెట్‌ గ్రౌండ్సులో బౌలింగ్‌ మెషిన్‌ సాయంతో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. ఆటగాళ్లందరూ నిర్ణీత సమయానికి చెన్నై చేరుకోవాలని సూచనలు చేశారు.

ఢిల్లీ క్యాపిటల్స్‌ సారధి శ్రేయస్‌అయ్యర్‌, ముంబై ఇండియన్స్‌ సారధి రోహిత్‌ శర్మ, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టన్‌ విరాట్‌ కోహ్లీ, చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారధి మహేంద్రసింగ్‌ ధోనీ, కోల్కతా నైట్‌ రైడర్స్‌ కెప్టన్‌ దినేశ్‌ కార్తిక్‌, సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టన్‌ డేవిడ్‌ వార్నర్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టన్‌ స్టీవ్‌ స్మిత్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సారధి లోకేశ్‌ రాహుల్‌, తమ జట్టులోని సభ్యులందరికీ... ఆయా నగరాల్లో కోవిడ్‌ టెస్టులు చేయించి దుబాయ్‌లో ఐపీఎల్‌ మ్యాచులకు ముందుగా క్వారంటైన్‌ నిబంధనలను పూర్తి చేయాలని సన్నద్ధమయ్యారు.

కరోనా లాక్ డౌన్ కారణంగా మూడు నెలల పాటు ప్రాక్టీస్ కు దూరమైన ఆటగాళ్ళందరూ మళ్ళీ గాడిన పడాలంటే కనీసం మూడు వారాల ట్రైనింగ్ క్యాంప్ ఖచ్చితంగా అవసరమని ఇప్పటికే బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో ప్రతీ ఫ్రాంచైజీ కనీసం 2-3 వారాల పాటు దుబాయ్ లోనే తమ ఆటగాళ్ళకు శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయనుంది. దీని కోసం ఆగష్ట్ 25 లోపే అన్ని ఫ్రాంచైజీల ఆటగాళ్ళు యుఏఈ చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ళకు మూడు వారాల ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించనున్న నేపథ్యంలో భారత జాతీయ జట్టుకు శిక్షణా శిబిరం లేనట్టే. ప్రస్తుతానికి టీమిండియా ట్రైనింగ్ క్యాంపును తాత్కాలికంగా పక్కన పెట్టినట్టు సమాచారం. ముందు అహ్మదాబాద్ లో టీమిండియా క్రికెటర్లకు ట్రైనింగ్ క్యాంపు నిర్వహించి...తర్వాత అక్కడి నుంచే నేరుగా ఐపీఎల్ కు వెళ్ళేలా ప్లాన్ చేసింది బీసీసీఐ. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది జరిగేలా కనిపించడం లేదు. దీంతో ఐపీఎల్ ఫ్రాంచైజీల ట్రైనింగ్ క్యాంపులకే క్రికెటర్లు వెళ్ళనున్నట్టు తెలుస్తోంది.

Tags :
|
|
|
|
|
|
|
|
|

Advertisement