Advertisement

  • చైనాను కాదని భారత్లో పెట్టుబడులు పెడుతున్న యాపిల్ ..

చైనాను కాదని భారత్లో పెట్టుబడులు పెడుతున్న యాపిల్ ..

By: Sankar Fri, 17 July 2020 9:21 PM

చైనాను కాదని భారత్లో పెట్టుబడులు పెడుతున్న యాపిల్ ..



కరోనా మహమ్మారి మరియు ఇతర దేశాలతో చైనా వ్యవహరిస్తున్న తీరు కారణంగా చైనాకు బాగానే షాకులు తగులుతున్నాయి ..ఇప్పటికే ఇండియా చైనాకు చెందిన యాప్స్ ను బ్యాన్ చేయగా , అమెరికా , ఆస్ట్రేలియా కూడా ఆ ఆలోచనలో ఉన్నాయి ..ఇది మాత్రమే కాకుండా చైనాలో పెట్టుబడులు పెట్టాలనుకున్న అనేక దిగ్గజ కంపెనీలు ఇప్పుడు భారత్ వైపుకు చూస్తున్నాయి ..

తాజాగా ప్రముఖ మొబైల్‌ దిగ్గజం యాపిల్‌ ఐఫోన్‌ను తయారుచేసే పెగట్రాన్‌ కంపెనీ దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమైంది. చెన్నైలో తైవాన్‌కు చెందిన పెగట్రాన్‌​ తయారీ పరిశ్రమను స్థాపించబోతున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. కాగా యాపిల్‌ను తయారుచేసే ప్రపంచ ప్రఖ్యాత తయారీ సంస్థలు విస్ట్రన్‌, ఫోక్సన్‌ కంపెనీలు ఇది వరకే దేశంలో తయారీని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎక్కువగా పెగట్రాన్‌ కార్యాలయాలు, ఉద్యోగులు చైనాలో ఉండగా, దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమవడం హర్షంచదగ్గ విషయమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

కాగా చైనాను కాదని దేశానికి ప్రాముఖ్యత ఇవ్వడం సంతోషకరమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం భారత్‌, చైనా సరిహద్దు వివాదాల నేపథ్యంలో దేశంలో పెట్టుబడులు పెట్టడం శుభసూచికమని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే గత సంవత్సరం యాపిల్‌ టర్నోవర్‌ దేశంలో 150కోట్ల డాలర్లు బిజినెస్‌ చేసిందని యాపిల్‌ సంస్థ వర్గాలు తెలిపాయి. కాగా మార్చి నెలలో పెగట్రాన​ సీఈఓ లియా షీ గ్యాంగ్‌ స్పందిస్తూ.. క్లయింట్ల సూచనలు, ప్రభుత్వాల పాలసీల అనుగుణంగా ఏ దేశంలో పెట్టుబడులు పెట్టాలనే అంశాన్ని పరిశీలిస్తామని ఆయన పేర్కొన్నారు


Tags :
|
|
|

Advertisement