Advertisement

  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్లైన్ సేవలకు అంతరాయం వల్ల ఖాతాదారులు ఆగ్రహం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్లైన్ సేవలకు అంతరాయం వల్ల ఖాతాదారులు ఆగ్రహం

By: chandrasekar Thu, 03 Dec 2020 11:48 PM

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్లైన్ సేవలకు అంతరాయం వల్ల ఖాతాదారులు ఆగ్రహం


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్లైన్ సేవలకు అంతరాయం వల్ల ఖాతాదారులు ఆగ్రహం వ్యక్త పరుస్తున్నారు. భారత ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలు కొద్ది సేపటి నుంచి ఆగిపోయాయి. ఆన్లైన్, యాప్ ల వేదికగా లావాదేవీలు జరిపేవారంతా సుమారు రెండు గంటల నుంచి అంతరాయాన్ని ఎదుర్కొంటున్నారు. ఎస్బీఐ ఆన్లైన్ సేవలతో పాటు YONO మొబైల్ యాప్ కూడా ఖాతాదారులకు పనిచేయడంలేదు. ఈరోజు ఉదయం నుంచే HDFC బ్యాంక్ ఆన్లైన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీనివల్ల చెల్లింపుల్లో మరింత అంతరాయం కలిగింది.

ప్రస్తుతం ఈ అంతరాయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉండగా ఇప్పుడు తాజాగా ఎస్బీఐ ఆన్లైన్ సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. దీంతో ఈ రెండు బ్యాంకుల ఖాతాదారులు సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా ఆగ్రహం తెలుపుతున్నారు. వినియోగదారులు యోనో యాప్ పనిచేయడం లేదని వారు ఎస్బీఐ ఖాతాకు ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేశారు. ప్రస్తుతం ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ ఇతర చెల్లింపులకూ అంతరాయం కలగడంతో ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెల మొదటి వరం కావడంతో దాదాపుగా ఎక్కువ చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఇలాంటి అంతరాయం మరింత ఇబ్బందికి లోను చేస్తుంది.

Tags :
|

Advertisement