Advertisement

  • ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్ సేవలు

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్ సేవలు

By: chandrasekar Wed, 09 Dec 2020 11:23 AM

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్ సేవలు


ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్ సేవలను జగన్ ప్రభుత్వం కల్పిస్తుంది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో టీవీ సర్వీసుతో పాటు ఇంటర్నెట్‌ సేవలను కొత్తగా అనుసంధానం చేయడం ద్వారా వినియోగదారుడి ఇంటి దగ్గర ఇన్‌స్టాల్ చేసిన ఆండ్రాయిడ్ ఐపీటీవీ, జీపీఓఎన్ బాక్స్ సహాయంతో నేరుగా టీవీలో ఈ సదుపాయాలు వినియోగించే వెసలుబాటు కలిగిస్తుంది. ఇందుకోసం ఇంటర్నెట్ లీసెడ్ లైన్లు, ఎంటర్‌ప్రైజ్‌ బ్రాడ్ బ్యాండ్, ఆడియో కాన్ఫరెన్స్ సేవలను రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలకు ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ అందిస్తూవుంది. ఈ సేవల కోసం గృహ వినియోగదారుడి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూ. 300 నుంచి రూ. 599 వరకు ప్లాన్స్‌ను ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో బాటు వ్యాపార, కార్యాలయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూ. 999 నుంచి రూ. 2,499 ప్లాన్స్ కూడా తీసుకొచ్చింది. ఈ ప్లాన్ అధికంగా వినియోగించే వారికి ఉపయోగపడనుంది.

ఇందుకోసం వీరు అందిస్తున్న బేసిక్ ప్యాక్ రూ. 300తో 200+ చానల్స్, 15 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 100 జీబీ డేటా గా ఉండనుంది. డేటా పరిమితి ముగిసిన తర్వాత 2 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నడుస్తుంది. అదేవిధంగా ఎస్సెన్షియల్ ప్యాక్ జీఎస్టీతో కలిపి రూ. 449కు 30 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో 300 జీబీ, ప్రీమియం ప్యాక్ జీఎస్టీతో సహా కలిపి రూ. 599కు 50 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా ప్యాక్ ఆఫర్ చేస్తోంది. అలాగే అధిక టీవీ ఛానెళ్లు మరియు అపరిమిత టెలిఫోన్ కాల్స్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.మధుసూదనరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సేవలను స్థానిక కేబుల్ ఆపరేటర్లతో భాగస్వామ్యం ద్వారా గృహాలకు ఆంధ్రప్రదేశ్ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ సేవలను అందిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాబోయే రోజుల్లో 50 లక్షల గృహాలకు ఈ ఫైబర్‌ నెట్‌వర్క్‌ సేవలు అందించే దిశగా ముందుకు సాగుతోంది. అలాగే క్రమేపీ పెరుగుతున్న చందాదారుల సంఖ్యకు తదనుగుణంగా నెట్‌వర్క్‌ సామర్థ్యానికి తగినట్లుగా సీపీఈ బాక్సుల సరఫరాను కూడా పెంచే యోచనలో ప్రభుత్వం వుంది. దీనిద్వారా ప్రజలకు తక్కువ ధరలో ఈ సదుపాయాలను కల్పించనున్నారు.

Tags :
|

Advertisement