Advertisement

ఇంటర్నెట్ వ్యసనం

By: chandrasekar Mon, 06 July 2020 10:35 AM

ఇంటర్నెట్ వ్యసనం


సిటీలో ప్రతి వంద మందిలో 95 మంది సెల్ లేదా కంప్యూటర్ లోనే అధిక సమయం గడుపుతున్నారు.అవసరమున్నా లేకపోయినా టైం పాస్‌ నుంచి వ్యసనంగా తయారైంది. ఇంటర్నెట్ వ్యసనంలోదేశంలోనే సిటీ 4వ స్థానంలో ఉంది. రోజురోజుకు ఇంటర్నెట్ అతిగా వాడే వ్యసనానికి అలవాటుప-డుతున్న వారు పెరుగుతున్నారు. మరోవైపు ప్రతిఏడాది ఇంటర్నెట్ వ్యసనానికి గురవుతున్న వారి వయసు తగ్గుతుంది. ఈ వ్యసనం అధికంగా 16ఏళ్లకు పైబడిన వారిలోనే ఎక్కువ ఉంది.

ఇంటర్నెట్కు అడిక్ట్ అయిన వారిలో 12 ఏళ్లు ఉన్న వారి సంఖ్య కూడా పెరుగుతోందని ‘వరల్డ్ అసోసియేషన్ ఫర్ సైకో సోషల్ రిహాబిలిటేషన్’ సంస్థ పరిశోధనలో తేలింది. రాష్ట్రంలోని ఇతర పట్టణ ప్రాంతాల్లో కూడాఇంటర్నెట్ అతి వినియోగం వల్ల 37 శాతం మందిటీనేజ్ మానసిక సమస్యలకు గురవుతున్నారు. 13–15 ఏళ్ల మధ్య ఉన్నవారు అధికంగా వీడియోగేమ్స్ కు అడిక్ట్ అయ్యారు. 15 –17 ఏళ్ల మధ్యఉన్న వారు ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియాలోరోజుకు దాదాపు 10 గంటలకు పైగా చూస్తున్నారు.ఈ వ్యసనంతో కేవలం మానసికంగానే కాకుండామెటబాలిక్ సమస్యలు కూడా వస్తున్నాయని సర్వేలోవెల్లడైంది. 18 –25 ఏళ్ల మధ్య ఉన్న కొంతమందియువతపై చేసిన స్టడీలో యువతులు ఎవరూసైబర్ సెక్సువల్ అడిక్షన్ కు గురవలేదని తెలపగా,పురుషులు మాత్రం 57 శాతం మంది తాము రెగ్యూ -లర్ గా పోర్న్ వీడియోలు చూస్తున్నట్లు చెప్పారు.

ఇంటర్నెట్ ను అధికంగా వాడడం వల్ల మానసి-కంగా సమస్యలు తలెత్తుతున్నా యి. విద్యార్థులుకూడా క్లాస్ లో ఉన్నా నెట్ లోనే మనసు లీనం చేసిఉండడం వల్ల కూడా తమ దృష్టిని చదువుపై సరిగాపెట్టలేకపోతున్నారు. సిటీలో 50 శాతానికి పైగా వివిధ కారణాలతోనిద్రలేమిని ఎదుర్కొంటున్నారు. ఇందులో సెల్ లోటైంపాస్ గా నెట్‌ చూస్తూ నిద్రను దూరం చేసుకుం-టున్న వారే దాదాపు 30 శాతం మంది ఉన్నారు.నైట్ చాట్ లు, లేట్ నైట్ వరకు వీడియోలుచూడడం వంటి వాటితో కంటి మీద కునుకులేకుండా పోతుంది. కాస్త నిద్రలోకి జారుకునే లోపేఏదో ఒక మెసేజ్ రావడం, చూడాల్సిందేనన్నఆత్రుతతో తిరిగి మేల్కోవడం ఇలా నిద్ర కంటి కిదూరమవుతుంది.

internet,addiction,mobile,laptop,television ,ఇంటర్నెట్, వ్యసనం,మానసి-కంగా, సమస్యలు, తలెత్తుతున్నా యి


సెల్ లో చూస్తూ అతిగా నెట్‌ వాడడం వల్ల తీవ్ర-మైన మెడ నొప్పి, వెన్ను సమస్యలు వస్తున్నా యి.తదేకంగా ఫోన్ లేదా కంప్యూటర్ స్క్రీన్ ను చూస్తుం-డడం వల్ల కంటి సమస్యలు తలెత్తుతున్నా-యి. అంతే కాకుండా తీవ్రమైన తలనొప్పి, తిం డిపైసరిగా దృష్టి పెట్టకపోవడంతో పాటు బరువు పెరగడం లేదా చిక్కిపోవడం వంటి వి జరుగుతున్నాయి. మీ పిల్లలు పొద్దస్తమానం ఫోన్లోనే తలదూరు-స్తున్నరా. గంటల తరబడి గేమ్‌, చాటింగ్‌ చేస్తున్నరా అయితే వారిని స్మార్ట్‌ ఫోన్ కుదూరంగా ఉంచాల్సిందే. లేకుంటే ప్రమాదంపొంచి ఉంది. అవును మీరు విన్నది నిజమే.రోజుకు ఐదు గంటలు మొబైల్‌ వాడితేశారీరక వ్యాయామం తగ్గుతోం దని,ఫలితంగా ఊబకాయం రావొచ్చని తాజాపరిశోధనలు పేర్కొంటున్నాయి.

వెనెజువె-లాలోని సైమన్‌ బొలివర్‌ యూనివర్సిటీలోహెల్త్‌ సైన్సెస్‌ ఫ్యాకల్టీ విభాగం ఓ సర్వే ని-ర్వహించిం ది. రోజుకు ఐదు గంటలు లేదాఅంతకంటే ఎక్కువ సేపు మొబైల్‌ ఉపయో-గించేవారిలో ఊబకాయం వచ్చే అవకాశా-లు 43శాతం ఉందని సర్వేలో తేలిం ది.డయాబెటిక్‌, గుం డెబబ్బు, క్యాన్సర్‌ కూడా..మొత్తం 1,060 మంది విద్యార్థుల్లో 19నుంచి 20ఏళ్లకు చెందిన 700 మందియువతులు, 360 మంది యువకులపైసర్వే చేపట్టారు. స్మార్ట్‌ఫోన్ ను ఎక్కువ-గా ఉపయోగించడం వల్ల ఊబకాయం,డయాబెటిక్‌, గుండె సంబంధిత వ్యాధుల-తోపాటు కొన్ ని రకాల క్యాన్సర్ల బాడిన పడేప్రమాదం ఉందని యూనివర్సిటీ ప్రతిని-ధులు హెచ్చరిం చారు. ఐదు గంటల కంటేఎక్కువ సమయం మొబైల్ లో గడిపిన యు-వకుల్లో 36 శాతం మంది బరువు పెరగగా,42.6శాతం మంది ఊబకాయానికి గురై-నట్లు సర్వేలో తేలిం దన్నా రు. యువతుల్లో63.9శాతం మంది బరువు పెరగగా, 57.4శాతం మంది ఒబేసిటీకి గురైనట్లు వెల్లడైంద-ని వివరించారు.

సెల్ ను అవసరానికిమించి వాడడం వల్ల మనిషి బతకడంమానేసి నెట్ కు అనుగుణంగా జీవించడంమొదలు పెడతారు. ఎక్కువ సమయంసెల్ తో గడుపుతూ వృథా చేయడంమంచిది కాదు. భవిష్యత్ లో తీవ్ర పరిణామాలు చూడాల్సి ఉంటుంది. పిల్లలను సెల్‌ చూడొద్దని తల్లిదండ్రులు హెచ్చరించడం,తిట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. వారికిబయట ప్రపంచం ఎలా ఉంటుందో, జీవితంవిలువలను తెలియజెప్పాలి. స్టూ డెంట్స్ చాలా వరకు మొబైల్‌ నెట్‌ బ్రౌజింగ్‌చేస్తున్నా రు. క్లాస్ టైంలో వారిని ఏకాగ్రతగాఉంచడానికి మొదటగా మొబైల్‌ స్వి చ్చ్ ఆఫ్చేయించి క్లాస్ లో ఓ పక్కన పెట్టిస్తాం . ఆతర్వాతనే క్లాసు చెబుతా.అవసరాన్ని బట్టి మొబైల్చూడాలి కానీ, అదే పనిగారోజంతా మొబైల్ కుఅతుక్కుపోతే భవిష్యత్ లోచాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది.

Tags :
|
|

Advertisement