Advertisement

  • మరో నెల పాటు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు

మరో నెల పాటు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు

By: Sankar Fri, 03 July 2020 6:21 PM

మరో నెల పాటు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు



కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అంతర్జాతీయ విమానాలపై ఇండియా నిషేధం విధించిన విషయం తెలిసిందే ..గత మూడు నెలలుగా అంతర్జాతీయ రాకపోకలపై ఇండియాలో రద్దు అమలు అవుతుంది ..కేవలం వందే భారత్ మిషన్ లో భాగంగా వెళ్లే విమానాలకు అనుమతి ఉంది ..అయితే ముందు ప్రకటించిన డేట్ ప్రకారం జులై 15 వరకే అంతర్జాతీయ విమానాలపై రద్దు ఉండగా , కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆ నిషేధాన్ని కేంద్రం జులై 31 వరకు పొడిగించింది ..

కరోనా వ్యాప్తి కారణంగా మార్చి 25 నుంచే అంతర్జాతీయ విమాన సర్వీసులను పౌరవిమానయాన శాఖ నిలిపివేసింది. అయితే.. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులకు అనుమతి ఇచ్చింది. అంతర్జాతీయ సర్వీసులపై ఆంక్షలు కొనసాగించింది. మరోవైపు.. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ‘వందే భారత్ మిషన్’ ద్వారా స్వదేశానికి తరలించే ప్రక్రియ కొనసాగుతోంది.

మరోవైపు, దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఇప్పటికే సాధారణ రైళ్ల సర్వీసులను ఆగస్టు 12 వరకు రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే.. ఈ షరతులు అంతర్జాతీయ కార్గో విమానాలకు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నడిపే విమానాలకు వర్తించవని స్పష్టం చేసింది. దేశీయ విమాన సర్వీసుల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని తెలిపింది.

Tags :

Advertisement