Advertisement

  • ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన ఉగ్రదాడిలో అంతర్జాతీయ క్రికెట్ అంపైర్ మృతి

ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన ఉగ్రదాడిలో అంతర్జాతీయ క్రికెట్ అంపైర్ మృతి

By: chandrasekar Mon, 05 Oct 2020 3:26 PM

ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన ఉగ్రదాడిలో అంతర్జాతీయ క్రికెట్ అంపైర్ మృతి


ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన ఉగ్రదాడిలో అంతర్జాతీయ క్రికెట్ కు చెందిన అంపైర్ మృతి చెందారు. అంతర్జాతీయ క్రికెట్‌లో విషాదం నెలకొంది. ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన ఉగ్రదాడిలో క్రికెట్ అంపైర్ బిస్మిల్లా జాన్ షిన్వారి మృతిచెందారు. ఆఫ్ఘన్ మీడియా కథనాల ప్రకారం శనివారం మధ్యాహ్నం నంగర్‌హార్ ప్రావిన్స్‌లోని ఘనిఖిల్ జిల్లా గవర్నర్ ఇంటి వద్ద భారీ పేలుడు సంభవించింది. కారులో పేలుడు పదార్థాలు నింపి ఓ ఉగ్రవాది ఆత్మహుతి దాడికి పాల్పడ్డాడు.

ఈ ఆత్మహుతి దాడిలో పేలుడు ధాటికి భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఈ ఘటనలో 15 మంది మరణించారు. మరో 30 మందికి గాయపడ్డారు. వారంతా ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరికొందరు ఉగ్రవాదులతో తుపాకులతో గవర్నర్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఐతే వారిని గవర్నర్ కార్యాలయ సెక్యూరిటీ సిబ్బంది కాల్చిచంపారు.

ఈ దాడిలో క్రికెట్ అంపైర్ బిస్మిల్లా జాన్ షిన్వారి కూడా మృతి చెందినట్లు స్థానిక మీడియా తెలిపింది. 36 ఏళ్ల బిస్మిల్లా జాన్ షిన్వారి 2017లో జరిగిన ఘాజి అమానుల్లా ఖాన్ ప్రాంతీయ వన్డే టోర్నమెంట్, 2017-18 అహ్మద్ షా అబ్దాలి 4-రోజుల టోర్నమెంట్ మ్యాచ్‌లకు అంపైరింగ్ చేశారు. అంతేకాదు పలు అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఐసీపీ అంపైర్‌గా సేవలందించారు. షిన్వారి మృతి పట్ల ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

Tags :
|

Advertisement