Advertisement

అంత‌ర్జాతీయ చాక్లెట్ దినోత్స‌వం

By: chandrasekar Wed, 08 July 2020 4:49 PM

అంత‌ర్జాతీయ చాక్లెట్ దినోత్స‌వం


అంత‌ర్జాతీయ చాక్లెట్ దినోత్స‌వంగా జూలై 7ను జ‌రుపుకుంటారు. కానీ, చాక్లెట్ తినేవాళ్ల‌కు ప్ర‌తిరోజూ చాక్లెట్ డేనే. చాక్లెట్స్ అంటే చిన్న పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రికీ ఇష్ట‌మే. అంతేకాదు చిన్నిపిల్ల‌ల ఏడుపు మాన్పించడానికి వారి చేతిలో ఒక చాక్లెట్ పెడితే చాలు వారి ముఖంలో చిరున‌వ్వును చూడొచ్చు. ఇక పెద్ద‌వాళ్లు అయితే ఆరోగ్యం బాగోలేక‌పోవ‌డం వ‌ల్ల చాక్లెట్స్‌కు దూరంగా ఉంటారు. నిజం చెప్పాలంటే కొన్ని చాక్లెట్లు తిన‌డం వ‌ల్ల డ‌యాబెటిస్ ఉన్న‌వారికి కూడా మంచి జ‌రుగుతుంది.

చాక్లెట్ అంటే ఒక‌టే కాదు. ఇందులో చాలా ర‌కాల ఫ్లేవ‌ర్లు ఉన్నాయి. కాక‌పోతే ఎక్కువ‌మంది ఇష్ట‌ప‌డేది మాత్రం డార్క్ చాక్లెట్‌నే. ఇది రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఐరోపాలో చాక్లెట్ గురించి 1520 ఏడాది నుంచే తెలుసు. యూరోపియన్లకు చాక్లెట్లంటే తెగ ఇష్టం. ప్రపంచం మొత్తంలో సగం చాక్లెట్ల వినియోగం ఐరోపాలోనే జరుగుతుంది. జర్మనీలో ఏటా ఒక్కో మనిషి 11 కిలోల చాక్లెట్లు తింటారట.

ప్రపంచ వ్యాప్తంగా క్యాడ్బరీ, మార్స్, నెస్లే, ఫెరోరీ, హేర్షేస్, లిండిట్, ఎజిస్టాక్స్, ఆర్కార్, మెర్జీ, ఇడ్జీజీ కంపెనీలు టాప్‌టెన్‌లో గుర్తింపు పొందాయి. ప్రపంచ వ్యాప్తంగా ఏటా పది లక్షల కోట్ల రూపాయల విలువైన చాక్లెట్ ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. ‘అసోచామ్’ సంస్థ గణాంకాల ప్రకారం మన గ్రామీణప్రాంతాల్లో ఏడాదికి చాక్లెట్ల‌ వ్యాపారం విలువ 750కోట్ల రూపాయలట. ఎందుకంటే చాక్లెట్లు సుమారు 600 రకాలు రుచుల‌ను క‌లిగి ఉంటాయి. చాక్లెట్ వ‌చ్చే చెట్టు శాస్త్రీయ నామం థియోబ్రామా కకావ్. దీని అర్థం ‘దేవతల ఆహారం’. మొదటిసారిగా చాక్లెట్ల‌ను ఐరోపాలో 1550 జూలై 7న ప‌రిచ‌యం చేశారు. అందుకే ఈ రోజును ‘చాక్లెట్ డే’గా కేటాయించారు. 2009 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఈ వేడుకల్ని ఘనంగా చేసుకుంటున్నారు.

ప్రపంచంలోని కోకోలో 30% ఆఫ్రికాలో పండిస్తారు. అయితే, కోకో బీన్ వాస్తవానికి అమెజాన్‌లో ఉద్భవించింది. ఇందులోని రంగులు రుచిపై ప్ర‌భావం చూపుతాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు క‌నుగొన్నారు. అందుక‌నే ఆరెంజ్ క‌ప్పులో హాట్ చాక్లెట్ తాగ‌డం వ‌ల్ల మంచి రుచి వ‌స్తుంది అని తెలిపారు. వైట్ చాక్లెట్ డే (సెప్టెంబర్ 22), మిల్క్ చాక్లెట్ డే (జూలై 28), చాక్లెట్ కవర్డ్ ఎనీథింగ్ డే (డిసెంబర్ 16), బిట్టర్‌స్వీట్ చాక్లెట్ డే (జనవరి 10) వంటి చాక్లెట్ల‌ వేడుక‌ను జ‌రుపుకోవ‌డానికి ఈ రోజుల‌ను ప్ర‌క‌టించారు.

Tags :
|
|

Advertisement