Advertisement

ఈ ఏడాది ఆన్ లైన్లో ఇంటర్మీయట్ ప్రవేశాలు...

By: chandrasekar Wed, 21 Oct 2020 10:09 AM

ఈ ఏడాది ఆన్ లైన్లో ఇంటర్మీయట్ ప్రవేశాలు...


కరోనా వల్ల పాఠశాలలు మరియు కళాశాలలు మూత పడ్డ విషయం తెలిసిందే. అందు వల్ల ఆన్‌లైన్‌లోనే ఈ ఏడాది ఇంటర్మీయట్ ప్రవేశాలు నిర్ణయించినట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు సెక్రటరీ వి. రామకృష్ణ విజయవాడలో పేర్కొన్నారు. https://bie.ap.gov.in/ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ రోజు నుండి నుంచి ఆన్ లైన్లో ఇంటర్మీయట్ కోర్సులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు.

ఇందుకుగాను అక్టోబర్ 29 వరకు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. కాగా రెండేళ్ళ ఇంటర్మీయట్ రెగ్యులర్‌తో పాటు ఒకేషనల్ కోర్సులకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు.

దరఖాస్తు చేసుకోవడానికి బీసీ,ఓసీ విద్యార్థులకు రూ. 200 ఫీజు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 100 ఫీజు చెల్లించాలన్నారు. విద్యార్థులు తమ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి 18002749868 టోల్ ఫ్రీ నంబర్ కాల్‌ చేయొచ్చని రామకృష్ణ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Tags :
|
|

Advertisement