Advertisement

ఆసక్తికరమైన వైరల్ వీడియోలు...డోంట్ మిస్ ఇట్

By: chandrasekar Mon, 27 July 2020 08:31 AM

ఆసక్తికరమైన వైరల్ వీడియోలు...డోంట్ మిస్ ఇట్


కరోనా పాజిటివ్ ఉన్నవారు ఆరోగ్య రీత్యా పెద్దగా సమస్యలు లేకుంటే వారు వైద్యుల సలహాలు పాటిస్తూ హోం క్వారెంటైన్‌లో ఉంటున్నారు. వైద్యుల సలహాల మేరకు ఇంట్లోని ఇతర కుటుంబ సభ్యులకు వారి నుంచి కరోనా వైరస్ సోకకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయిన భర్తకు నెగటివ్‌గా నిర్ధారణ అయిన భార్య భోజనం వడ్డిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పై అంతస్తు నుంచి భర్త ఉట్టెను కిందకు పంపగా అందులో భార్య భోజనం వడ్డించి పైకి పంపుతారు.

ఓ బామ్మ కర్రసామును ప్రదర్శిస్తూ భిక్షాటన చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై స్పందించిన సోనూ సూద్, పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఆమె ఆచూకీ చెప్పాలని సోషల్ మీడియా వేదికగా కోరారు. ఈ నేపథ్యంలో ఆమె పూణెలో ఉన్నట్లు తెలిసింది. మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి 85 ఏళ్ల శాంతబాయ్ పవార్‌కు చీరను కానుకగా ఇచ్చారు. అలాగే రూ.1 లక్ష సాయాన్ని ఎన్సీపీ పార్టీ తరఫున అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మరోసారి కర్రసాముతో అలరించిన వీడియో సోసల్ మీడియాలో వైరల్ గా మారింది.

గుజరాత్‌లోని గిర్ అడవుల్లో ఓ ఆడ సింహం, మగ సింహం కొట్లాట సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీన్ని భార్య, భర్తల గొడవతో పోల్చుతూ నెటిజన్స్ చేస్తున్న కామెంట్స్ సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్నాయి.


మొసలిని చూస్తే ఎవరైనా భయపడుతారు. అయితే ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి ఓ మొసలిని తోక పట్టుకుని లాక్కెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫ్లోరిడాలోని ఓ స్కూల్‌ వద్ద నీటి కుంటలో నుంచి మొసలి బయటకు రాగా ఓ వ్యక్తి దాన్ని పట్టుకున్నాడు. ఏ మాత్రం సీరియస్‌నెస్ లేకుండా ఎంతో తేలిగ్గా దాన్ని లాక్కెళ్లాడు. గత వారం సోషల్ మీడియాలో అత్యధికంగా వైరల్ అయిన వీడియోల్లో ఇవి కూడా ఉన్నాయి.

Tags :
|
|
|

Advertisement