Advertisement

  • తెలంగాణ నుంచి అంతరాష్ట్ర బస్సు సర్వీసులు ప్రారంభం ..

తెలంగాణ నుంచి అంతరాష్ట్ర బస్సు సర్వీసులు ప్రారంభం ..

By: Sankar Mon, 28 Sept 2020 11:01 AM

తెలంగాణ నుంచి అంతరాష్ట్ర బస్సు సర్వీసులు ప్రారంభం ..


తెలంగాణలో కరోనా కేసులు మెల్లిగా తగ్గుముఖం పడుతున్నాయి. కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ ప్రభుత్వం చకచకా నిర్ణయాలు తీసుకుంటోంది.

ఇప్పటికే హైదరాబాద్ లో మెట్రో రైల్, సిటీ బస్సులు, అర్బన్ పార్కులు తిరిగి తెరుచుకున్నాయి. తాజగా అంతర్రాష్ట్ర బస్ సర్వీసులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈరోజు నుంచి రాష్ట్రాల మధ్య బస్సులు పరుగులు తీయబోతున్నాయి. తెలంగాణ నుంచి కర్ణాటక, మహారాష్ట్ర లకు బస్సులు నడిపేందుకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, ఏపీకి బస్సులు నడిపే విషయంపై తెలంగాణ సర్కార్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

ఈరోజు ఉదయం 5:30 గంటల నుంచి తెలంగాణ-కర్ణాటక, తెలంగాణ -మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య బస్సులు మొదలయ్యాయి. తెలంగాణ నుంచి కర్ణాటకలోని మైసూరు, బీదర్, గంగావతి, గుల్బర్గా, రాయచూరుకు, మహారాష్ట్రలోని ముంబై, పూణే, నాగపూర్, నాందేడ్, షిర్డీ లకు బస్సులు తిరగబోతున్నాయి

Tags :
|

Advertisement