Advertisement

  • విటమిన్ డి తక్కువగా ఉంటే ..కరోనా ముప్పు ఎక్కువగా ఉన్నట్లే

విటమిన్ డి తక్కువగా ఉంటే ..కరోనా ముప్పు ఎక్కువగా ఉన్నట్లే

By: Sankar Mon, 27 July 2020 6:39 PM

విటమిన్ డి తక్కువగా ఉంటే ..కరోనా ముప్పు ఎక్కువగా ఉన్నట్లే



కరోనా మహమ్మారి విజృంభణ మీద రోజుకొక కొత్త న్యూస్ బయటకు వస్తుంది తాజాగా ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు సరికొత్త విషయాన్ని తెలిపారు ..విటమిన్ డి తక్కువ ఉన్న రోగుల్లో కరోనా విజృంభించే అవకాశం ఎక్కువగా ఉంది అని తేల్చారు ..ఇజ్రాయెల్‌లోని బార్-ఇలాన్ విశ్వవిద్యాలయానికి చెందిన ల్యూమిట్ హెల్త్ సర్వీసెస్ (ఎల్‌హెచ్‌ఎస్), అజ్రిలీ ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్ పరిశోధకుల అధ్యయనం ఎఫ్‌ఈబీఎస్ జర్నల్‌లో ప్రచురితమైంది.

ఈ అధ్యయనం కోసం పరిశోధకుల బృందం మొత్తం 7,807 మందిని ఎంచుకుంది. ఇందులో 782 మందికి కరోనా పాజిటివ్‌ ఉంది. మిగతా 7,025 మంది సాధారణ వ్యక్తులు. వీరిలో విటమిన్‌ డీ స్థాయిని పరిశీలించారు. సాధారణ వ్యక్తుల కంటే కరోనా పాజిటివ్‌ ఉన్న వ్యక్తుల్లో సగటు ప్లాస్మా విటమిన్ డీ స్థాయి గణనీయంగా తక్కువగా ఉందని వారు కనుగొన్నారు.

అలాగే, ఇందులో వయస్సు, లింగం, ఆర్థిక, సామాజిక పరిస్థితుల ప్రభావం లేదని, ఎవరికి విటమిన్‌ డీ తక్కువుంటే వారు కొవిడ్‌ బారిన పడే ప్రమాదముందని తమ పరిశోధనలో తేలినట్లు ప్రధాన పరిశోధకులలో ఒకరైన డాక్టర్ యూజీన్ మెర్జోన్ పేర్కొన్నారు. అయితే, విటమిన్‌ డీ గనుక రోగులకు అందజేస్తే వారు తిరిగి కోలుకునే అవకాశం ఉంటుందని, శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడుతూ దవాఖానలో చేరినవారికి ఈ విటమిన్‌ అందిస్తే కోలుకుంటారనే గత అధ్యయనాలతో తాము ఏకీభవిస్తున్నామని చెప్పారు. సూర్యరశ్మిలో ప్రతిరోజూ 30 నిమిషాలు ఉంటూ, విటమిన్‌ డీ సప్లిమెంట్స్‌ తీసుకుంటే కొవిడ్‌నుంచి కోలుకోవచ్చని వారు సూచిస్తున్నారు.

Tags :
|
|

Advertisement