Advertisement

  • ఇన్స్టంట్ రుణాల యాప్ లకు చైనాకు లింక్ లు ఉన్నాయి..కర్ణాటక పోలీసులు

ఇన్స్టంట్ రుణాల యాప్ లకు చైనాకు లింక్ లు ఉన్నాయి..కర్ణాటక పోలీసులు

By: Sankar Sun, 27 Dec 2020 5:54 PM

ఇన్స్టంట్ రుణాల యాప్ లకు చైనాకు లింక్ లు ఉన్నాయి..కర్ణాటక పోలీసులు


ఇన్‌స్టంట్‌ యాప్‌ రుణాల స్కామ్‌కు చైనాకు లింక్‌లు ఉన్నాయని కర్ణాటక సీఐడీ పోలీసుల దర్యాప్తులో తేలింది. సదరు కంపెనీలు భారతీయుల మొబైల్ ను హ్యాక్‌ చేసి, వారి కాంట్రాక్ట్‌ సమాచారం తస్కరిస్తున్నాయని సీఐడీ-సైబర్‌ క్రైం ఎస్పీ ఎండీ శరత్‌ చెప్పారు.

ఈ విషయమై బెంగళూరులోని నాలుగు సంస్థల డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీ చేసినప్పుడు సంబధిత యాప్‌ల ‘అప్లికేషన్‌ సర్వర్‌’ చైనాలో ఉందని, దీనికి శాస్త్రీయమైన ఆధారాలున్నాయన్నారు.ఇన్‌స్టంట్‌ లోన్ యాప్స్‌ సంస్థలు తమ సమాచారాన్ని తస్కరించాయని బాధితులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎండీ శరత్‌ తెలిపారు..

కాగా తాము తస్కరించిన డేటాను అడ్డం పెట్టుకుని రుణాలు తీసుకున్న బాధితులను బెదిరిస్తారు. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తారు. లైంగిక దాడి చేస్తామని బెదిరింపులకు దిగుతారు. పలు కేసుల్లో సంబంధిత సంస్థలు తాము తస్కరించిన బాధితుల ఫోన్‌ నంబర్‌తో కొత్త వాట్సాప్‌ గ్రూప్‌ చేస్తాయి. ఆ గ్రూప్‌ నుంచి అందులో ఉన్న సభ్యులకు అసభ్యకర మెసేజ్‌లు పంపడంతో బాధితులు కుంగిపోతారు. ఇలా ఇటీవల తెలంగాణాలో ముగ్గురు దాకా మరణించారు.

Tags :
|

Advertisement