Advertisement

  • గూగుల్ తన పేమెంట్స్ యాప్ గూగుల్ పే ను ప్రమోట్ చేసిందన్న ఆరోపణలఫై విచారణ...

గూగుల్ తన పేమెంట్స్ యాప్ గూగుల్ పే ను ప్రమోట్ చేసిందన్న ఆరోపణలఫై విచారణ...

By: chandrasekar Thu, 12 Nov 2020 5:44 PM

గూగుల్ తన పేమెంట్స్ యాప్ గూగుల్ పే ను ప్రమోట్ చేసిందన్న ఆరోపణలఫై విచారణ...


గూగుల్ కంపెనీ తన ప్లే స్టోర్ మరియు ఆండ్రాయిడ్ ఓఎస్‌లపై తన ప్రమేయం ద్వారా ఇతర పోటీ యాప్‌లకు బదులుగా నగదు చెల్లింపులకు గూగుల్ పే వైపు మొగ్గు చూపుతోందని వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విచారణకు ఆదేశాలు జారీ చేశారు. టెక్ దిగ్గజం గూగుల్ తన పేమెంట్స్ యాప్ గూగుల్ పే ను ప్రమోట్ చేసిందన్న ఆరోపణలపై ద కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా విచారణకు ఆదేశించింది. ఇతర నగదు చెల్లింపుల యాప్స్‌ను డామినేట్ చేస్తూ, గూగుల్ సొంత కంపెనీ యాప్ ‘గూగుల్ పే’ను ప్రమోట్ చేసిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తుకు దారి తీసింది.

గూగుల్ కంపెనీ తన ప్లే స్టోర్ మరియు ఆండ్రాయిడ్ ఓఎస్‌లపై తన ప్రమేయం ద్వారా ఇతర పోటీ యాప్‌లకు బదులుగా నగదు చెల్లింపులకు గూగుల్ పే వైపు మొగ్గు చూపుతోందని వాదనలు ఉన్నాయి. యూపీఈ ఇతర పేమెంట్ యాప్‌లకు ఇది అవరోధంగా మారిందని, ఇలాంటి కారణాలతోనే అగ్రస్థానంలోకి వచ్చిందని గూగుల్‌పై చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం నిబంధనల ఉల్లంఘన అవుతుందని సీసీఐ పేర్కొంది. విచారణ చేపట్టాలని డైరెక్టర్ జనరల్‌కు సీసీఐ ఆదేశాలు జారీ చేసింది. చట్టంలోని సెక్షన్ 26(1) ప్రకారం విచారణ చేపట్టాలని సూచించింది. దీనిపై విచారణ చేపట్టిన 60 రోజులల్లో దర్యాప్తు నివేదిక సమర్పించాలని సీసీఐ సూచించింది. పోటీ కంపెనీల ఆరోపణలపై గూగుల్, దాని మాతృ సంస్థ ఆల్ఫాబెట్ స్పందించాయి. జీ పే యాప్‌ (Google Pay)నకు సెర్చ్ ర్యాంకింగ్స్‌లో గూగుల్ ఏమాత్రం సాయం చేయలేదని స్పష్టం చేశారు. సంబంధిత విషయాలను మాత్రమే సెర్చింగ్‌లో కనిపించేలా గూగుల్ పనిచేస్తుందన్నారు. గూగుల్ పే యాప్‌నకు మాత్రమే గూగుల్ మద్దతిచ్చిందన్నది తప్పుడు ఆరోపణలని కొట్టిపారేశారు.

Tags :

Advertisement