Advertisement

India Vs Australia 2nd ODI: డేవిడ్ వార్నర్ కు గాయాలు...!

By: Anji Sun, 29 Nov 2020 10:59 PM

India vs Australia 2nd ODI: డేవిడ్ వార్నర్ కు గాయాలు...!

భారత్‌తో జరిగిన రెండో వన్డేలో డేవిడ్ వార్నర్ గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తుండగా బంతిని ఆపే క్రమంలో గాయపడిన వార్నర్ మైదానాన్ని వీడాడు.

భారత్ బ్యాటింగ్ చేస్తుండగా.. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో ధావన్ ఆడిన షాట్‌ను ఆపబోయిన వార్నర్ కింద పడిపోయాడు. ఈ క్రమంలో తొడ కండరం గాయానికి గురైన ఆసీస్ ఓపెనర్.. తిరిగి పైకి లేవడానికి ఇబ్బంది పడ్డాడు.

చివరకు ఫిజియో, మ్యాక్స్‌వెల్ సాయంతో కుంటుతూ మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత ఎక్స్‌రే తీయించడం కోసం వార్నర్‌ను కార్లో స్టేడియం నుంచి హాస్పిటల్‌కు తీసుకొని వెళ్లారు.

వాహనం ఎక్కడానికి వెళ్తున్నప్పుడు కూడా వార్నర్ కుంటుతూనే నడిచాడు. గ్రోయిన్ స్ట్రెయిన్ నుంచి కోలుకోవడానికి చాలా చాలా సమయం పడుతుందని కామెంటేటర్ గిల్‌క్రిస్ట్ వ్యాఖ్యానించాడు. గ్రో

స్ట్రెయిన్ నుంచి కోలుకోవడానికి కనీసం ఆరు వారాల సమయం పట్టే అవకాశం ఉండటంతో.. వార్నర్ టెస్టు సిరీస్‌కు కూడా దూరమైనట్లే.

వన్డే సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉండగా.. మూడు టీ20ల సిరీస్, నాలుగు టెస్టుల సిరీస్‌కు కొద్ది రోజుల ముందు వార్నర్ గాయపడటం ఆస్ట్రేలియాకు పెద్ద దెబ్బగానే భావించొచ్చు.

తొలి వన్డేలో హాఫ్ సెంచరీ చేసిన వార్నర్.. రెండో వన్డేలో 83 పరుగులు చేశాడు. ఫించ్‌తో కలిసి రెండు మ్యాచ్‌ల్లోనూ తొలి వికెట్‌కు వరుసగా 156, 142 చొప్పున భాగస్వామ్యాలు నెలకొల్పాడు.

Tags :

Advertisement