Advertisement

  • ఆవు గాయపడింది అని ఏకంగా హెలికాప్టర్ నే రప్పించాడు ..ఏ దేశంలో తెలుసా !

ఆవు గాయపడింది అని ఏకంగా హెలికాప్టర్ నే రప్పించాడు ..ఏ దేశంలో తెలుసా !

By: Sankar Fri, 21 Aug 2020 08:35 AM

ఆవు గాయపడింది అని ఏకంగా హెలికాప్టర్ నే రప్పించాడు ..ఏ దేశంలో తెలుసా !


మన దేశంలో పశువులలో ఆవును దేవత లాగ కొలుస్తారు ..ప్రతి పండగలకు ఆవుకు పూజలు చేస్తారు..ఆవుకు కొంచెం ఏమైనా గాయం అయిన యజమానులు విలవిలలాడుతారు..అయితే, ఓ రైతు ఎంతో అభిమానంగా పెంచుకుంటున్న ఆవు మేతకు వెళ్లి గాయపడిగా.. అది నడిస్తే ఇబ్బంది పడుతుందని ఏకంగా హెలికాప్టర్‌లోనే తరలించాడు. ఈ ఘటన స్విట్జర్లాండ్‌లో చోటుచేసుకుంది. ఇది ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. గోమాతాపై ఆ రైతుకున్న ప్రేమే ప్రపంచవ్యాప్తంగా ఆయనకు గుర్తింపు తీసుకొచ్చింది.

స్విట్జర్లాండ్‌కు చెందిన ఓ రైతుకి తన వద్ద ఉన్న ఆవు అంటే చాలా ఇష్టం. అది ఇబ్బందిపడితే ఆయన మనసు చివుక్కు మంటుంది. ఆల్ప్స్‌లోని ఓ పర్వతంలో నిర్వహించిన బోడెన్‌ఫహార్డ్ కార్యక్రమానికి తరలించిన ఆవు గాయపడి కుంటుతూ నడుస్తుండడాన్ని రైతు గమనించాడు.

అది అలాగే నడుచుకుంటూ వెళ్తే మరింత ఇబ్బంది పడుతుందని భావించాడు. దీంతో వెంటనే ఆవును తరలించడానికి హెలికాప్టర్‌ను ఏర్పాటు చేయించాడు. సహాయక సిబ్బంది వచ్చి ఆవుకి తాళ్లు కట్టి హెలికాప్టర్‌ ద్వారా పైకి లేపి పర్వతాల్లోంచి బయటకు తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌ అయింది. ఆ రైతుపై ప్రశంసల జల్లు కురుస్తోంది.


Tags :
|
|

Advertisement