Advertisement

  • ఒంగోలు జీజీహెచ్‌లో అమానవీయ సంఘటన...శవాన్ని కుక్కలు పీక్కుతిన్నాయి

ఒంగోలు జీజీహెచ్‌లో అమానవీయ సంఘటన...శవాన్ని కుక్కలు పీక్కుతిన్నాయి

By: chandrasekar Wed, 12 Aug 2020 10:25 AM

ఒంగోలు జీజీహెచ్‌లో అమానవీయ సంఘటన...శవాన్ని కుక్కలు పీక్కుతిన్నాయి


ఒంగోలు జీజీహెచ్‌‌లో అమానవీయ సంఘటన జరిగింది. జీజీహెచ్ బయటే ఓ మృతదేహం రెండు రోజులుగా పడి ఉన్నా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. చివరకు ఈ మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్నాయని వార్తలు వచ్చాయి. ఈ దారుణ ఘటనపై ట్విట్టర్‌ వేదికగా మంగళవారం తెలుగు దేశం పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగి చనిపోయి రెండు రోజులు గడిచినా జీజీహెచ్‌ సిబ్బంది పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘ఒంగోలు జీజీహెచ్‌‌లో ఓ ఘటన చోటుచేసుకుంది రోగి చనిపోయి రెండు రోజులు గడిచినా జీజీహెచ్‌ సబ్బంది పట్టించుకోలేదు. కుక్కలు మృతదేహాన్ని పీక్కుతిన్నాయి. ఇది ముమ్మాటికీ మనుషుల ఆత్మగౌరవాన్ని తీవ్రంగా అగౌరవ పరచటమే. ఈ దుర్ఘటనలో రాష్ట్ర ప్రభుత్వ పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ దారుణాన్ని ఖండించేందుకు కూడా నాకు మాటలు రావట్లేదు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆ మృతి చెందిన వ్యక్తి ఓ యాచకుడని తెలుస్తోంది. 70 ఏళ్ల వయసు ఉంటుందని సమాచారం. గత కొన్ని రోజులుగా ఆ యాచకుడు జీజీహెచ్ సమీపంలోనే సంచరిస్తున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఆయన మరణించగా ఎవరూ పట్టించుకోకపోవడంతో కుక్కలు పీక్కుతిన్నట్లు తెలుస్తోంది.

Tags :
|

Advertisement