Advertisement

  • ఇన్ ఫీనిక్స్ జీరో 8ఐ స్మార్ట్ ఫోన్ లాంచ్...ధర రూ.15 వేలలో

ఇన్ ఫీనిక్స్ జీరో 8ఐ స్మార్ట్ ఫోన్ లాంచ్...ధర రూ.15 వేలలో

By: chandrasekar Sat, 10 Oct 2020 3:17 PM

ఇన్ ఫీనిక్స్ జీరో 8ఐ స్మార్ట్ ఫోన్ లాంచ్...ధర రూ.15 వేలలో


ఇన్ ఫీనిక్స్ జీరో 8ఐ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. గతంలో లాంచ్ అయిన ఇన్‌ఫీనిక్స్ జీరో 8 స్మార్ట్ ఫోన్‌కు టోన్డ్ డౌన్ వెర్షన్ తరహాలో ఇది లాంచ్ అయింది. దీన్ని మొదటగా పాకిస్తాన్‌లో లాంచ్ చేశారు. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ గా ఉంది. మీడియాటెక్ హీలియో జీ90టీ ప్రాసెసర్‌ను ఇందులో అందించారు.

ఇన్ ఫీనిక్స్ జీరో 8ఐ ధర మరియు స్పెసిఫికేషన్లు

ఇన్ ఫీనిక్స్ జీరో 8ఐ ధరను 34,999 పాకిస్తాన్ రూపాయలుగా (మనదేశ కరెన్సీలో రూ.15,600) నిర్ణయించారు.

8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. బ్లాక్ డైమండ్, గ్రీన్ డైమండ్, సిల్వర్ డైమండ్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. దీని సేల్ పాకిస్తాన్‌లో అక్టోబర్ 15వ తేదీ నుంచి జరగనుంది.

ఇందులో 6.85 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ పంచ్ హోల్ డిస్ ప్లేను ఇన్‌ఫీనిక్స్ అందించింది. 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.

మీడియాటెక్ హీలియో జీ90టీ ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు.

స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది.

ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 48 మెగా పిక్సెల్ సెన్సార్ ను అందించారు.

దీంతోపాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ టెర్టియరీ లెన్స్, మరో ఏఐ సెన్సార్‌ కూడా ఉన్నాయి.

సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్, 8 మెగా పిక్సెల్ సెన్సార్లను ఫోన్ ముందువైపు కూడా అందించారు.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎక్స్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది.

ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఫోన్ పక్కభాగంలో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ గా ఉంది.

Tags :
|
|

Advertisement