Advertisement

  • అదిరిపోయే ఫీచర్ల తో ఇన్ఫీనిక్స్ జీరో 8 మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్

అదిరిపోయే ఫీచర్ల తో ఇన్ఫీనిక్స్ జీరో 8 మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్

By: chandrasekar Sat, 29 Aug 2020 4:43 PM

అదిరిపోయే ఫీచర్ల తో ఇన్ఫీనిక్స్ జీరో 8 మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్


ఇన్ ఫీనిక్స్ జీరో 6కు తర్వాతి వెర్షన్ గా ఇన్ ఫీనిక్స్ జీరో 8 లాంచ్ అయింది. జీరో 7కు బదులుగా జీరో 8 స్మార్ట్ ఫోన్ ను ఇన్ ఫీనిక్స్ లాంచ్ చేసింది. ఇన్ ఫీనిక్స్ జీరో 8 స్మార్ట్ ఫోన్ లో ఆక్టా-కోర్ ప్రాసెసర్ ను అందించారు.

దీనిలో వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్ ఉంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ గా ఉంది. దీనిలో వెనకవైపు డైమండ్ ఆకారంలో ఉన్న కెమెరాలు అందించారు. డ్యూయల్ సెల్ఫీ కెమెరాలు కూడా ఇందులో ఉన్నాయి. దీనిలో కేవలం ఒక్క వేరియంట్ ను మాత్రమే ఇన్ ఫీనిక్స్ లాంచ్ చేసింది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ తో లాంచ్ అయిన ఈ వేరియంట్ ధరను 37,99,000 ఇండోనేషియా రూపాయలుగా (సుమారు రూ.19,200)

నిర్ణయించబడింది. బ్లాక్, బ్లూ, వైట్ రంగుల్లో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చాయి. ఆగస్టు 31వ తేదీ నుంచి దీనికి సంబంధించిన సేల్ ప్రారంభం అవనుంది. లాంచ్ ఆఫర్ కింద 30,99,000 ఇండోనేషియా రూపాయలకే (సుమారు రూ.15,700) ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది

ఇన్ ఫీనిక్స్ జీరో 8 స్పెసిఫికేషన్లు:

దీనిలో 6.85 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే ఉంచారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్ గానూ ఉంది.

ఈ స్మార్ట్ ఫోన్ లో వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఒక డెప్త్ సెన్సార్, అల్ట్రా నైట్ వీడియో కెమెరా అందించారు.

ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ90టీ ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్ ను దీనిలో అందించారు.

ఇక ముందువైపు 48 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ను అందించారు.

దీని స్టోరేజ్ సామర్థ్యం 128 జీబీగా ఉంది. ఇందులో 4500 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 33W ఫాస్ట్ చార్జింగ్ ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.

ఈ ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అందించారు. దీంతోపాటు మల్టీ డైమెన్షనల్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని కూడా ఇందులో అందించారు.

Tags :
|

Advertisement