Advertisement

  • స్వచ్ సర్వేక్షన్ అవార్డు లలో వరుసగా నాలుగోసారి ఆ సిటీకి క్లీనెస్ట్ సిటీ అవార్డు

స్వచ్ సర్వేక్షన్ అవార్డు లలో వరుసగా నాలుగోసారి ఆ సిటీకి క్లీనెస్ట్ సిటీ అవార్డు

By: Sankar Thu, 20 Aug 2020 1:05 PM

స్వచ్ సర్వేక్షన్ అవార్డు లలో  వరుసగా నాలుగోసారి ఆ సిటీకి క్లీనెస్ట్ సిటీ అవార్డు


స్వచ్ స‌ర్వేక్ష‌న్ అవార్డులలో వరుసగా నాలుగో ఏడాది కూడా ఇండోర్ ఏ క్లీనెస్ట్ సిటీ అవార్డు దక్కించుకుంది.వార్షిక స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌న్ స‌ర్వే ఫ‌లితాల‌ను ఇవాళ వెల్ల‌డించారు. అయితే వ‌రుస‌గా నాలుగ‌వ సారి ఇండోర్ న‌గ‌రం ఆ అవార్డును గెలుచుకోవ‌డం గ‌మ‌నార్హం.

గుజ‌రాత్‌కు చెందిన సూర‌త్ రెండ‌వ స్పాట్‌లో ఉండ‌గా, మ‌హారాష్ట్ర‌కు చెందిన న‌వీ ముంబై మూడ‌వ ర్యాంక్‌లో ఉన్న‌ది. ఢిల్లీలో కేంద్ర గృహ‌, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి హ‌రిదీప్ సింగ్ పురి ఈయేటి స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌న్ అవార్డుల‌ను ప్ర‌క‌టించారు.

క్లీనెస్ట్ సిటీగా నాలుగ‌వ సారి అవార్డు గెలుచుకున్న ఇండోర్‌కు మంత్రి హ‌రిదీప్ కంగ్రాట్స్ చెప్పారు. ప‌రిశుభ్ర‌త ప‌ట్ల ఆ న‌గ‌ర ప్ర‌జ‌లు ఎన‌లేని అంకిత‌భావాన్ని ప్ర‌ద‌ర్శించిన‌ట్లు ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌కు కూడా ఆయ‌న కంగ్రాట్స్ తెలిపారు. క్లీనెస్ట్ కంటోన్మెంట్‌గా జ‌లంధ‌ర్ కంటోన్మెంట్‌కు అవార్డు ద‌క్కింది. ఇక గంగా న‌ది వెంట ఉన్న న‌గ‌రాల్లో.. ప్రాచీన ప‌విత్ర న‌గ‌రం వారాణికి క్లీనెస్ట్ టౌన్‌గా అవార్డు ద‌క్కింది. ఆ న‌గ‌ర లోక్‌స‌భ ఎంపీగా ఉన్న ప్ర‌ధాని మోదీకి మంత్రి హ‌రిదీప్ కంగ్రాట్స్ తెలిపారు.

Tags :
|
|
|

Advertisement