Advertisement

  • మాస్క్ పెట్టుకోకపోతే స్మశానంలో గుంతలు తవ్వాలి ..ఇండోనేషియా ప్రభుత్వం వింత శిక్ష

మాస్క్ పెట్టుకోకపోతే స్మశానంలో గుంతలు తవ్వాలి ..ఇండోనేషియా ప్రభుత్వం వింత శిక్ష

By: Sankar Tue, 15 Sept 2020 3:40 PM

మాస్క్ పెట్టుకోకపోతే స్మశానంలో గుంతలు తవ్వాలి ..ఇండోనేషియా ప్రభుత్వం వింత శిక్ష


కరోనా కాలంలో శానిటైజ్, మాస్క్ అనే పదాలు బాగా పాపులర్ అయ్యాయి. గతంలో మాస్క్ పెట్టుకునే వాళ్ళను విచిత్రంగా చూస్తున్నారు. ఇప్పుడు మాస్క్ లేకుండా బయటకు వెళ్తే జరిమానా విధిస్తున్నారు. కొన్ని చోట్ల శిక్షలు కూడా విధిస్తున్నారు. జరిమానాలు, చిన్న చిన్న శిక్షలు విధిస్తున్నప్పటికి మార్పు రావడం లేదు. దీంతో ఇండినేషియా ప్రభుత్వం వింత శిక్షలు అమలు చేస్తున్నది.

మాస్క్ పెట్టుకోకుండా బయటకు వెళ్లిన వారితో స్మశానంలా గోతులు తవ్విస్తున్నారు. మరణించిన కరోనా రోగులను ఖననం చేసేందుకు ఇలా గోతులు తవ్విస్తున్నారు. కరోనాతో మరణించిన వారిని దగ్గరి నుంచి చూసిన తరువాతైనా మార్పు వస్తుందని, అందుకే ఇలాంటి శిక్షలు విధిస్తున్నట్టు జావా అధికారులు చెప్తున్నారు. గత కొన్ని రోజులుగా ఇండోనేసియాలో కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది..కరోనా కు ఇంకా వాక్సిన్ రాలేదు అకాబాట్టి స్వీయ నియంత్రణ చర్యలతోనే కరోనా ను అరికట్టాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు..అందులో అతి ముక్యమైంది మాస్క్ ..మాస్క్ పెట్టుకోకుండా అజాగ్రత్తతో తిరిగితే కరోనా ను తెచ్చుకున్నట్లే అని హెచ్చరిస్తున్నారు

Tags :
|

Advertisement