Advertisement

  • భారతదేశ తొలి ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ కన్నుమూత

భారతదేశ తొలి ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ కన్నుమూత

By: chandrasekar Fri, 16 Oct 2020 5:46 PM

భారతదేశ తొలి ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ కన్నుమూత


భారతదేశ తొలి ఆస్కార్ అవార్డు గ్రహీత, బాలీవుడ్ ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ భాను అథియా (91) కన్నుమూశారు. వయసురీత్యా అనారోగ్య సమస్యలతో బాధపుడుతున్న భాను అథియా ముంబైలోని తన నివాసంలో గురువారం తుదిశ్వాస విడిచారు. తన తల్లి మరణవార్తను ఆమె కుమార్తె రాధికా గుప్తా తెలిపారు. దేశానికి తొలి ఆస్కార్ అవార్డు అందించిన ఆమె మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు సంతాపం ప్రకటించారు. భాను అథియా అంత్యక్రియలను దక్షిణ ముంబైలోని చందన్ వాడీ శ్మశానవాటికలో నిర్వహించారు.

ఎనిమిదేళ్ల కిందట మెదడులో కణతిని తొలగించేందుకు ఆమెకు సర్జరీ చేశారని కూతురు తెలిపారు. ఆపై భాను అథియా శరీరంలో ఓ భాగం పక్షవాతానికి గురై మంచానికి పరిమితం అయ్యారని, చివరగా నిద్రలో ప్రశాంతంగా తన తల్లి తనువు చాలించారని తెలిపారు. 1983లో తెరకెక్కిన ‘గాంధీ’ సినిమాకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేశారు. ఆ సినిమాకుగానూ భాను అథియా ఆస్కార్ అవార్డు అందుకున్నారు. భారతదేశానికి తొలి ఆస్కార్ అందించిన వ్యక్తి భాను అథియా పేరు చరిత్రలో నిలిచిపోతుంది.

Tags :

Advertisement