Advertisement

  • బైడెన్ కేబినెట్‌లోకి భారతీయులు... వివేక్‌ మూర్తి మరియు అరుణ్‌ మజుందార్?

బైడెన్ కేబినెట్‌లోకి భారతీయులు... వివేక్‌ మూర్తి మరియు అరుణ్‌ మజుందార్?

By: chandrasekar Thu, 19 Nov 2020 10:24 AM

బైడెన్ కేబినెట్‌లోకి భారతీయులు...  వివేక్‌ మూర్తి మరియు అరుణ్‌ మజుందార్?


బైడెన్ కేబినెట్‌లోకి భారతీయులను తీసుకోనున్నట్లు కథనాలు. ఇందులో వివేక్‌ మూర్తి మరియు అరుణ్‌ మజుందార్ గా ఉండవచ్చని తెలుస్తుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహకాలు చేస్తున్నారు. ఆయా విభాగాలకు అధికారులు, మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేస్తు్న్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. భారత్‌ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్న బైడెన్ తన మంత్రివర్గంలోనూ ఇండో-అమెరికన్లకు చోటు కల్పించాలని భావిస్తున్నారట. అంతేకాదు బైడెన్, కమలా హారిస్ గెలుపులో ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో భారతీయులను మెప్పించడానికి కేబినెట్‌లోకి ఒకరిద్దరు ఇండో అమెరికన్లను తీసుకోవాలని నిర్ణయించారట. బైడెన్ తన కేబినెట్‌ కోసం పరిశీలిస్తున్న ఇండో అమెరికన్లలో వివేక్‌ మూర్తి, అరుణ్‌ మజుందార్‌ పేర్తు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వివేక్ మూర్తి ఇప్పటికే కొవిడ్‌-19 వ్యవహారంలో జో బైడెన్‌కు సలహాదారుగా ఉన్నారు. ఆయణ్ని కేబినెట్‌లోకి తీసుకొని ఆరోగ్య శాఖ బాధ్యతలు అప్పగించే అవకాశాలు వుంది.

అదే విధంగా అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ అయిన మరో భారతీయ అమెరికన్ అరుణ్ మజుందార్‌కు ఇంధన శాఖ కేటాయించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ‘ది వాషింగ్టన్‌ పోస్ట్‌’, ‘పొలిటికో’ కథనాలను రాశాయి. ఓటమిని ఇంకా అంగీకరించని అధ్యక్షుడు ట్రంప్‌ అధికార మార్పిడికి సహకరించనప్పటికీ ఎన్నికల్లో గెలిచిన జో బైడెన్‌ పాలనా యంత్రాంగంపై దృష్టిపెట్టారు. వివేక్‌ మూర్తి అమెరికాలో మంచి పేరున్న వైద్యుడిగా గుర్తింపు సాధించారు. ఆయన వయసు 45 ఏళ్లు. ఒబామా, ట్రంప్‌ పాలనా సమయంలో దేశానికి సర్జన్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఆయనకు ఉంది. పబ్లిక్‌ హెల్త్‌ సర్వీస్‌ కమిషన్‌ కోర్‌కు వైస్‌ అడ్మిరల్‌ హోదాలో విధులు నిర్వహించారు. డాక్టర్స్‌ ఫర్‌ అమెరికా అనే సంస్థను కూడా స్థాపించారు. వివేక్ మూర్తి స్వస్థలం భారత దేశంలోని కర్ణాటక రాష్ట్రం. యూకేకు వలస వచ్చిన మూర్తి కుటుంబం ఆ తర్వాత అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ప్రతిష్టాత్మక హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం, యేల్‌ విశ్వవిద్యాలయాల్లో మూర్తి చదివారు. కొన్ని నెలలుగా ఆయన బైడెన్‌కు కరోనాపై మార్గదర్శకత్వం చేస్తున్నారు. ఇందువల్ల ఆయనకు కేబినెట్‌లోకి అవకాశాలు రావచ్చును.

Tags :

Advertisement