Advertisement

  • జో బిడెన్‌కు ఆర్థికంగా అండగా నిలిచిన వారిలో భారతీయుల ప్రధాన పాత్ర...

జో బిడెన్‌కు ఆర్థికంగా అండగా నిలిచిన వారిలో భారతీయుల ప్రధాన పాత్ర...

By: chandrasekar Fri, 06 Nov 2020 11:20 AM

జో బిడెన్‌కు ఆర్థికంగా అండగా నిలిచిన వారిలో భారతీయుల ప్రధాన పాత్ర...


డెమోక్రాటిక్ ప్రెసిడెంట్ అభ్యర్థి జో బిడెన్ తన సమీప ప్రత్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌తో హోరాహోరీగా పోరాడుతున్నారు. మరో మూడు రాష్ట్రాల్లో కౌంటింగ్ కొనసాగుతున్నది. చివరి వార్తలు అందేసరికి బిడెన్ 253 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా.. ట్రంప్‌కు 214 వచ్చాయి. అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కాకముందు నుంచి బిడెన్‌ అమెరిక-ఇండియన్‌లపై ప్రత్యేక దృష్టిసారించారు. ఉపాధ్యక్ష అభ్యర్థి కమలాదేవి హారిస్‌తో జతకట్టడం కూడా ఆయనకు మరింత కలిసొచ్చింది. ప్రధాన నిధుల సేకరణలో కూడా భారతీయ అమెరికన్లు బిడెన్‌కు అండగా నిలిచి పెద్ద మొత్తంలో విరాళాలను అందజేశారు. భారతీయ అమెరికన్లతో పాటు ఈ ఏడాది తన ప్రచారం కోసం కనీసం 100,000 డాలర్లు సేకరించారు. జో బిడెన్‌కు ఆర్థికంగా అండగా నిలిచిన వారిలో భారతీయులు ప్రధాన పాత్ర పోషించారు. 800 మంది ప్రధాన దాతల జాబితాలో డజన్ల మంది భారతీయ అమెరికన్లు ఉన్నారు. భారతీయ అమెరికన్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నవారు ప్రసిద్ధ సంఘ నాయకులు స్వదేశ్ ఛటర్జీ, రమేష్ కపూర్, శేఖర్ ఎన్ నరసింహన్, ఆర్ రంగస్వామి, అజయ్ జైన్ భూటోరియా, ఫ్రాంక్ ఇస్లాం ఉన్నారు.

అలాగే, ఇతర ప్రముఖ భారతీయ అమెరికన్ దాతల్లో నీల్ మఖిజా, రాహు, ప్రకాష్, దీపక్ రాజ్, రాజ్ షా, రాజన్ షా, రాధిక షా, జిల్, రాజ్ సింగ్, నిధి ఠాకర్, కిరణ్ జైన్, సోనీ కల్సి, బేలా బజారియా ఉన్నారు. భారతీయ-అమెరికన్ కాంగ్రెస్ మహిళ అభ్యర్థి ప్రమీలా జయపాల్ కూడా బిడెన్‌కు ఆర్థిక సాయం చేశారు. విరాళాలు అందజేసినవారి జాబితాలో 100,000 డాలర్లకు పైగా ఇచ్చిన వారు కూడా ఉన్నారు. సాంప్రదాయ భారతీయ-అమెరికన్ డెమోక్రాటిక్ దాతలు హోటలియర్ సంత్ చాట్వాల్ వంటివారు ఈ జాబితాలో లేరు. ది వాల్ స్ట్రీట్ జర్నల్ వార్తల ప్రకారం, విరాళాలు ఇచ్చినవారి జాబితాలో మాజీ, ప్రస్తుత గవర్నర్లు, సెనేటర్లు, క్యాబినెట్ కార్యదర్శులు, హాలీవుడ్ నుంచి పెద్ద వ్యక్తులు ఉన్నారు. చిత్ర నిర్మాత జెఫ్రీ కాట్జెన్‌బర్గ్, రచయిత, దర్శకుడు లీ డేనియల్స్, లింక్డ్ఇన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్, మీడియా మొగల్ హైమ్ సబన్, అమెరికా మాజీ వాణిజ్య కార్యదర్శి పెన్నీ ప్రిట్జ్‌కేర్ ఈ జాబితాలో ఉన్నారని ది వాల్‌స్ట్రీట్ జర్నల్‌ తెలిపింది. సీఎన్ఎన్ నివేదికల ప్రకారం, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో బిడెన్ 700 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. రెండు సంవత్సరాల కాలంలో దాతల నుంచి బిలియన్ డాలర్లను సేకరించిన మొదటి అధ్యక్ష అభ్యర్థిగా బిడెన్ నిలిచాడు.

Tags :

Advertisement