Advertisement

  • స్టేడియంలో ఆస్ట్రేలియా యువతికి లవ్ ప్రపోజ్ చేసిన భారత యువకుడు

స్టేడియంలో ఆస్ట్రేలియా యువతికి లవ్ ప్రపోజ్ చేసిన భారత యువకుడు

By: Sankar Sun, 29 Nov 2020 8:19 PM

స్టేడియంలో ఆస్ట్రేలియా యువతికి లవ్ ప్రపోజ్ చేసిన భారత యువకుడు


ఇండియా ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ లో జరిగిన రెండో వన్ డే లో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది ...భారత జట్టు బ్యాటింగ్ చేస్తుండగా.. స్టేడియంలో ఉన్న అభిమానుల్లో.. టీమిండియా జెర్సీలో ఉన్న ఇండియన్ యువకుడు ఒకరు.. ఆస్ట్రేలియా జెర్సీలో ఉన్న ఆ దేశ యువతికి ప్రపోజ్ చేశాడు.

మోకాలిపై నిలబడి యువతికి ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేయగా.. ఆమె సంతోషంగా అంగీకరించింది. తర్వాత ఒకరినొకరు హత్తుకొని ప్రేమను వ్యక్తం చేయగా.. పక్కనే ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ వారిని ఉత్సాహపరిచారు.

మ్యాచ్ జరుగుతుండగా.. ఇండియన్ యువకుడు ఆస్ట్రేలియా యువతికి లవ్ ప్రపోజ్ చేయడాన్ని గమనించిన ఆసీస్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ నవ్వుతూ... చప్పట్లతో వారిని అభినందించాడు. స్టేడియంలో ఈ ప్రేమ ప్రపోజల్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags :
|

Advertisement