Advertisement

  • యూఎస్ ఓపెన్ రెండవ రౌండ్ లో భారతీయ టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నాగల్ ఓటమి

యూఎస్ ఓపెన్ రెండవ రౌండ్ లో భారతీయ టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నాగల్ ఓటమి

By: chandrasekar Sat, 05 Sept 2020 10:01 AM

యూఎస్ ఓపెన్ రెండవ రౌండ్ లో భారతీయ టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నాగల్ ఓటమి


ఈ సంవత్సరం ప్రారంభమైన యూస్ ఓపెన్ లో మొదటి రౌండ్ లో గెలుపొందిన సుమిత్ నాగల్ రెండవ రౌండ్లో ఓటమి పాలైనాడు. యూఎస్ ఓపెన్ రెండ‌వ రౌండ్‌లో భార‌తీయ టెన్నిస్ ప్లేయ‌ర్ సుమిత్ నాగ‌ల్ ఓట‌మి పాల‌య్యాడు. ఆస్ట్రియాకు చెందిన రెండ‌వ సీడ్‌ డామినిక్ థీమ్ చేతిలో నాగ‌ల్‌ 6-3, 6-3, 6-2 స్కోరుతో వ‌రుస సెట్ల‌లో ప‌రాజ‌యం పొందాడు.

ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఫైన‌ల్‌కు వెళ్లిన డామినిక్ థీమ్‌ ఈ మ్యాచ్‌కు ముందు సుమిత్ నాగ‌ల్ ఆట తీరు గురించి వీడియోల‌ను ప‌రిశీలించిన‌ట్లు చెప్పాడు. సుమిత్ నాగ‌ల్ ఫోర్‌హ్యాండ్ షాట్లు బాగా ఆడుతాడ‌ని థీమ్ మెచ్చుకున్నాడు. యూఎస్ ఓపెన్ సింగిల్స్‌లో భార‌త్ త‌ర‌పున ఆడిన ఆట‌గాళ్లు త‌క్కువే.

మన దేశంలో టెన్నిస్ కు తక్కువ ప్రాధాన్యం వల్ల ఎక్కువ మంది ఈ క్రీడలో పాల్గొనడం లేదు. కానీ నాగ‌ల్ మొదట ఆశ‌లు రేపినా థీమ్ థాటికి చేతులెల్తేశాడు. తొలి సెట్ అయిద‌వ గేమ్‌లో ఇద్ద‌రూ నువ్వా నేనా అన్న‌ట్లుగా చెల‌రేగారు. అప్పుడ‌ప్పుడు మెరుపు లాంటి షాట్ల‌తో నాగ‌ల్ ద‌డ పుట్టించినా టాప్ ప్లేయ‌ర్ ముందు త‌ల‌వంచ‌క త‌ప్ప‌లేదు. మరింతగా ప్రాక్టీస్ చేయడం ద్వారా సుమిత్ నాగల్ ఉన్నత స్థానాలకు చేరగలడని భావిస్తాం.

Tags :
|
|

Advertisement