Advertisement

  • ప్రపంచంలో మొదటి కరోనా వ్యాక్సిన్‌‌ పై స్పందించిన భారత స్టార్ స్పిన్నర్

ప్రపంచంలో మొదటి కరోనా వ్యాక్సిన్‌‌ పై స్పందించిన భారత స్టార్ స్పిన్నర్

By: Sankar Tue, 11 Aug 2020 7:40 PM

ప్రపంచంలో మొదటి కరోనా వ్యాక్సిన్‌‌ పై స్పందించిన భారత స్టార్ స్పిన్నర్



ఇంతకాలం కరోనా మహమ్మారితో ఎటువంటి మందు , వ్యాక్సిన్ లేకుండానే పోరాడిన ప్రపంచ దేశాలకు రష్యా శుభవార్త చెప్పింది..ప్రపంచంలోనే మొట్ట మొదటి కరోనా వైరస్ వాక్సిన్ విడుదల చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ప్రకటించాడు.ఆ దేశ అధ్యక్షుడి కుమార్తెకే మొదటి వ్యాక్సిన్‌ ఇచ్చారు..

అయితే దీనిపై ఇండియన్‌ క్రికెటర్‌, ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ స్పందించాడు. మొదటి టీకాను విడుదల చేసిన రష్యాను అభినందించాడు. మొదటి టీకా వచ్చేసింది. వ్యాక్సిన్‌ ప్రయోగం కూడా అయిపోయింది. ఇది బాగా పనిచేస్తే అందరూ దీన్నే అనుసరిస్తారు. వెల్‌డన్‌.. రష్యా వ్యాక్సిన్‌‌. అని ట్వీట్‌ చేశాడు.

కాగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలైనప్పుడు అశ్విన్ సోషల్‌ మీడియాలో చాలా చురుగ్గా ఉన్నాడు. కొవిడ్‌ నిబంధనలు పాటించనివారిపై విరుచుకుపడ్డాడు. అలాగే, ప్రతి జాతీయ క్రికెటర్ మాదిరిగానే ఇంటికే పరిమితమయ్యాడు. మార్చి 2020 ప్రారంభంలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో అతను చివరిసారిగా కనిపించాడు. ఇప్పుడు ఐపీఎల్‌లో కనిపించబోతున్నాడు. శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు.

Tags :
|
|
|
|

Advertisement