Advertisement

సిరీస్ కు దూరమయిన స్టార్ బౌలర్ ఉమేష్ యాదవ్

By: Sankar Thu, 31 Dec 2020 10:59 AM

సిరీస్ కు దూరమయిన స్టార్ బౌలర్ ఉమేష్ యాదవ్

ఆస్ట్రేలియా తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో టీమిండియా సంచలన ప్రదర్శన చేస్తుంది..అయితే గాయాలు కూడా అదే స్థాయిలో టీమిండియాను వేధిస్తున్నాయి..మొదటి టెస్ట్ మ్యాచ్ లో మరో పేసర్ షమీకి గాయం కావడంతో అతను టెస్ట్ సిరీస్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది.

ఇక తాజాగా ఉమేష్ యాదవ్ ది కూడా అదే పరిస్థితి. రెండో టెస్ట్ మ్యాచ్ లో బౌలింగ్ చేస్తున్న సమయంలో ఉమేష్ గాయం బారిన పడ్డాడు. ఆ తర్వాత ఆ మ్యాచ్ లో ఆడని ఉమేష్ ఇప్పుడు మొత్తం సిరీస్ కే దూరమయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఉమేష్ ఆడటం లేదు. తర్వాతి టెస్టుకు కూడా సందేహమే అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

ఇక ఈ పర్యటనలో ఉమేష్ యాదవ్ రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అయితే షమీ స్థానంలో రెండో టెస్ట్ లోకి సిరాజ్ ఎంట్రీ ఇవ్వగా ఇప్పుడు మూడో టెస్ట్ కు ఉమేష్ స్థానంలో సైని లేదా నటరాజ్ రావాల్సి ఉంటుంది.

Tags :
|

Advertisement