Advertisement

  • భారత స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ ఆత్మవిశ్వాసం

భారత స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ ఆత్మవిశ్వాసం

By: chandrasekar Tue, 26 May 2020 4:50 PM

భారత స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ ఆత్మవిశ్వాసం


భారత జాతీయ జట్టుకు మళ్లీ ఆడుతానని సీనియర్‌ స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. చివరగా ఆసియా కప్‌(2016)లో టీమ్‌ఇండియా తరఫున ఆడిన భజ్జీ ఐపీఎల్‌లో చెన్నై తరఫున అదరగొట్టాడు. తనదైన స్పిన్‌ నైపుణ్యంతో డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ను కూడా దడదడలాడించాడు.

సోమవారం ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోతో హర్భజన్‌ మాట్లాడుతూ ‘ఐపీఎల్‌ లాంటి క్లిష్టమైన టోర్నీలో నేను మెరుగ్గా రాణించాను. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లు పోటీపడే లీగ్‌లో రాణించినప్పుడు అంతర్జాతీయంగాను ఆకట్టుకోవచ్చు. పవర్‌ప్లే, మిడిల్‌ ఓవర్లలో కట్టుదిట్టమైన బంతులతో బ్యాట్స్‌మెన్‌ దూకుడును అడ్డుకోల్గుతున్నాను.

ఆస్ట్రేలియా, భారత్‌, ఇంగ్లండ్‌ అద్భుతమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న జట్లు. ఐపీఎల్‌లో బెయిర్‌స్టో, వార్నర్‌ను ఔట్‌ చేసినప్పుడు ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌ల్లోనూ ఔట్‌ చేయలేనా. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో బోర్డు తరఫున ఎవరూ నాతో మాట్లాడేటట్లు కనిపించడం లేదు’ అని భజ్జీ అన్నాడు.


Tags :
|

Advertisement