Advertisement

  • రైల్వే ప్రయాణికులకు శుభవార్త ...అక్టోబర్ 15 నుంచి 200 స్పెషల్ ట్రైన్లు

రైల్వే ప్రయాణికులకు శుభవార్త ...అక్టోబర్ 15 నుంచి 200 స్పెషల్ ట్రైన్లు

By: Sankar Fri, 02 Oct 2020 04:51 AM

రైల్వే ప్రయాణికులకు శుభవార్త ...అక్టోబర్ 15 నుంచి 200 స్పెషల్ ట్రైన్లు


ఈ నెల 25 న దసరా, ఆ తరువాత దీపావళి రాబోతున్నది. సాధారణంగా పండగల సమయంలో బస్సులు, రైళ్లు రద్దీగా ఉంటాయి. ప్రత్యేక బస్సులు, రైళ్లు వేస్తుంటారు. అయితే, కరోనా కాలం కావడంతో ప్రజలు ఇప్పటికే సొంత ఊర్లలో ఉన్నారు. కొంతమంది ఉద్యోగస్తులు మాత్రం సిటీల్లో ఉంటున్నారు. అన్ లాక్ ప్రక్రియ మొదలుకావడంతో ఇప్పటికే ఇప్పటికే రైళ్లు పరుగులు తీస్తున్నాయి. స్పెషల్ ట్రైన్స్ మాత్రమే రన్ చేస్తున్నారు.

ముందుగా బుక్ చేసుకున్న వారికి మాత్రమే సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇటీవలే మరికొన్ని రైళ్లను పెంచారు. పూర్తి స్తాయిలో రైళ్లు పరుగులు తీయడం లేదు. అయితే, పండగ సీజన్ ను దృష్టిలో పెట్టుకొని మరో 200 స్పెషల్ రైళ్లను వేయబోతున్నట్టు రైల్వేశాఖ తెలిపింది. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని అంటున్నారు.

రైల్ సర్వీసులను పెంచడంపై జోన్ అధికారులతో మాట్లాడుతున్నట్టు రైల్వే శాఖ పేర్కొన్నది. అదే విధంగా స్థానిక ప్రభుత్వాలతో కూడా మాట్లాడుతున్నట్టు రైల్వేశాఖ తెలిపింది. కరోనాను దృష్టిలో పెట్టుకొని నిబంధనలు పాటిస్తూ రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే.

Tags :
|

Advertisement