Advertisement

  • భారతీయ రైల్వే కీలక నిర్ణయం...వందేభారత్ రైళ్ల నిర్మాణ గ్లోబల్ టెండర్లు రద్దు

భారతీయ రైల్వే కీలక నిర్ణయం...వందేభారత్ రైళ్ల నిర్మాణ గ్లోబల్ టెండర్లు రద్దు

By: chandrasekar Sat, 22 Aug 2020 02:33 AM

భారతీయ రైల్వే కీలక నిర్ణయం...వందేభారత్ రైళ్ల నిర్మాణ గ్లోబల్ టెండర్లు రద్దు


భారతీయ రైల్వే వందేభారత్ రైళ్ల నిర్మాణ గ్లోబల్ టెండర్లను రద్దు చేసింది. 44 సెమీ హైస్పీడ్ రైళ్ల నిర్మాణం నిమిత్తం పిలిచిన ఈ టెండర్ల రద్దు చైనాకు అతి పెద్ద దెబ్బగా అనుకుంటున్నారు. ఇండియా చైనా సరిహద్దు ఘర్షణ చాలా రకాలుగా ప్రభావం చూపుతోంది.

చైనా దేశపు యాప్ లను ఇప్పటికే నిషేధించిన ఇండియా ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. 44 సెమీ హై స్పీడ్ వందేభారత్ రైళ్ల నిర్మాణం కోసం ఇండియన్ రైల్వేస్ పిలిచిన గ్లోబల్ టెండర్లను రద్దు చేసింది. ఇండియన్ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే, ఈ రైళ్లను ఇప్పుడు ఇండియానే స్వయంగా తయారు చేయనుంది. రైల్వే శాఖ తీసుకున్న టెండర్ల రద్దు నిర్ణయం చైనాకు పెద్ద షాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ టెండర్లలో చైనాకు చెందిన జాయింట్ వెంచర్ కంపెనీ సీఆర్పీసీ పయనీర్ ఎలక్ట్రిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఏకైక విదేశీ బిడ్డర్ గా ఉంది.

గురుగ్రామ్ కు చెందిన పయనీర్ కంపెనీతో చైనాకు చెందిన సీఆర్పీసీ యోంగ్ జి ఎలక్ట్రిక్ కంపెనీ 2015లో జాయింట్ వెంచర్ నెలకొల్పింది. వాస్తవానికి 44 వందేభారత్ రైళ్ల నిర్మాణ టెండర్ ఈ చైనా కంపెనీకు దక్కే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయి. టెండర్లను రద్దు చేయడంతో చైనా కంపెనీకు పెద్ద షాక్ గా చెప్పవచ్చు.

Tags :
|

Advertisement