Advertisement

  • దేశంలో సాధారణ రైళ్ల సేవలు సెప్టెంబర్ 30 వరకు రద్దు

దేశంలో సాధారణ రైళ్ల సేవలు సెప్టెంబర్ 30 వరకు రద్దు

By: Sankar Tue, 11 Aug 2020 10:58 AM

దేశంలో సాధారణ రైళ్ల సేవలు సెప్టెంబర్ 30 వరకు రద్దు



దేశంలో కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ సాధారణ రైళ్ల సేవలను సెప్టెంబర్ ౩౦ వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ..సాధారణ రైల్వే సేవలను ఈ నెల 12 వరకు రద్దు చేస్తున్నట్టు జూన్ 25న జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. రేపటితో ఆ గడువు ముగియనున్న నేపథ్యంలో తాజాగా మళ్లీ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం నడుస్తున్న 230 కోవిడ్ స్పెషల్ రైళ్లు మాత్రమే నడుస్తాయని ఈ సందర్భంగా రైల్వేశాఖ తెలిపింది.

అయితే, లాక్‌డౌన్ సమయంలో ప్రయాణికులకు సేవలు అందించేందుకు ప్రారంభించిన ప్రత్యేక రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు, ఇతర రైళ్ల సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి నివారణ కోసం కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అనేక రకాల చర్యలు తీసుకుంటున్నాయి.

మరోవైపు దేశవ్యాప్తంగా 24గంటల్లో దేశంలో 53,601 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 871మరణాలు సంభవించాయి.దీంతో మంగళవారం నాటికి దేశంలో కరోనా మరణాల సంఖ్య 45,257కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.

Tags :
|
|
|

Advertisement