Advertisement

  • క్రయోజనిక్‌ ఇంజిన్‌ తయారీలో భారతీయ ప్రైవేట్ సంస్థలు

క్రయోజనిక్‌ ఇంజిన్‌ తయారీలో భారతీయ ప్రైవేట్ సంస్థలు

By: chandrasekar Tue, 29 Sept 2020 09:16 AM

క్రయోజనిక్‌ ఇంజిన్‌ తయారీలో భారతీయ ప్రైవేట్ సంస్థలు


అంతరిక్ష విభాగంలో భారత దేశం ఎంతో వేగంగా ముందుకెళుతోంది. తన సొంత పరిజ్ఞానంతో అంతరిక్షంలోనికి చాలా రాకెట్లను ప్రయోగించింది. ప్రస్తుతం అంతరిక్ష ప్రయోగాల్లో భారత్‌లో కూడా ప్రైవేటు సంస్థలు దూసుకుపోతున్నాయి. దేశంలోనే తొలిసారిగా ప్రైవేటు అంకుర కంపెనీ క్రయోజనిక్‌ ఇంజిన్‌ను తయారు చేసింది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ సంస్థ ఈ ఘనత సాధించింది.

ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించడం వల్ల మరింతగా అభివృద్ధి పదంలో ప్రయాణించవచ్చు. ప్రఖ్యాత శాస్త్రవేత్త సతీష్‌ధావన్‌ గౌరవార్థం ఈ క్రయోజనిక్‌ ఇంజిన్‌కు ధావన్‌-1 అని పేరు పెట్టారు. ఈ సంస్థ త్వరలో ప్రయోగించబోయే ప్రైవేటు రాకెట్‌ విక్రమ్‌-2 లో ఈ క్రయోజనిక్‌ ఇంజిన్‌ను వాడనున్నట్టు స్కైరూట్‌ సీఈవో పవన్‌కుమార్‌ చందన తెలిపారు.

ఈ ప్రైవేటు సంస్థ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ క్రయోజనిక్‌ ఇంజిన్‌లో ఇంధనంగా లిక్విడ్‌ నాచురల్‌ గ్యాస్‌ (ఎల్‌ఎన్‌జీ)ని వాడుతున్నారు. ఆక్సిడైజర్‌గా ద్రవ ఆక్సిజన్‌ను వాడుతున్నట్టు తెలిపారు. క్రయోజనిక్‌ ఇంజిన్‌ను అన్నిరకాలుగా పరీక్షించి చూశామని చందన చెప్పారు. ఈ సంస్థ ఇప్పటికే ఘన ఇంధనంతో నడిచే రాకెట్‌ ఇంజిన్‌ను తయారుచేసింది.

Tags :
|

Advertisement